140 కోట్లు పెడితే... వెనక్కి వచ్చింది 12 కోట్లేనా?

Tue Mar 21 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Bollywood Selfi Movie Business

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఫిలిమ్ మేకర్స్ ఒరిజినల్ సినిమాలు చేయడం కంటే... ఇతర భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను మళ్లీ రీమేక్ చేసి రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అదే విధంగా అనేక సినిమాలు వచ్చి డిజాస్టర్ ఫలితాలు అందుకుంటున్నా... ఎందుకో మళ్లీ ఆ రీమేకుల వెంటే పడుతున్నారు.శాటిలైట్ డిజిటల్ హక్కుల్లో బయటపడిపోవచ్చని భావిస్తూ.. రీమేక్లు చేస్తున్నారో ఏమో తెలియడం లేదు కానీ... ఆ సినిమాలు థియేటర్ల వద్ద దారుణమైన డిజాస్టర్ ఫలితాలు అందుకుంటున్నాయి.

తెలుగు నుంచి రీమేక్ అయిన సినిమాలతో పాటు తమిళం నుంచి రీమేక్ అయిన సినిమాలు కూడా ఇదే పాఠం నేర్పాయి. కానీ ఇప్పుడు ఒక సినిమా అయితే దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అదే సెల్ఫీ.

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ ఖర్చులు 140 కోట్ల వరకు అయినట్లు తెలుస్తుంటే... కేవలం ఈ సినిమా 12 కోట్లు మాత్రమే ఇప్పటివరకు థియేటర్లో రాబట్టిందని తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పాతిక కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా 12 కోట్ల షేర్ మాత్రమే వెనక్కి రావట్టుకో గలిగింది. అంటే 140 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తే కేవలం 12 కోట్లు వెనక్కి తీసుకువచ్చిందని అంటున్నారు. అలా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక నష్టాల బారిన పడే సినిమాలు జాబితాలో ఈ సినిమా చేరే అవకాశం కనిపిస్తోంది.
 
మలయాళంలో సూరజ్ పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో నటించగా హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా డిజాస్టర్ దెబ్బకు అయినా సరే హిందీ దర్శక నిర్మాతలు కొంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పడితే బావుండని అక్కడి ట్రేడ్ అనలిస్టుల భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా పూర్తి రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేయబోతుంది అనేది.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.