Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో బాలీవుడ్ భామల గుసగుస!
By: Tupaki Desk | 10 Jun 2023 6:00 AMఅలియాభట్ టాలీవుడ్ ఎంట్రీతో సీన్ ఏ రేంజ్ లో టర్న్ అయిందో చూస్తూనే ఉన్నాం. 'ఆర్ ఆర్ ఆర్' తో అమ్మడికి ఎనలేని గుర్తింపు దక్కింది. పాన్ ఇండియాలో ఓ వెలుగు వెలిగింది. మళ్లీ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలి అన్న ఆసక్తిని పెంచింది అలియాభట్.
కానీ బాలీవుడ్ కమిట్ మెంట్ల కారణంగా చేయలేని పరిస్థితి. ఆమెని చూసి బాలీవుడ్ నుంచి ఏకంగా స్టార్ హీరోయిన్లే దిగిపోతున్నారు. ఇప్పటికే 'ప్రాజెక్ట్- కె' లో దీపికా పదుకొణే నటిస్తుంది. ఆమెతో పాటు దిశా పటానీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
రామ్ చరణ్ సరసన 'గేమ్ ఛేంజెర్' లో కియారా అద్వానీ నటిస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాతో జాన్వీ ఎంట్రీ ఇస్తుంది. ఇంకా గేట్లు తెరవాలే గానీ యంగ్ హీరోయిన్లు సారా అలీఖాన్..పరిణితి చోప్రా లాంటి వారు పరిగెత్తుకొచ్చేయాలని చూస్తున్నారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాని కూడా తీసుకురావాలని మరోవైపు సీరియస్ ప్రయత్నాలు సాగిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇలా టాలీవుడ్ లో బాలీవుడ్ భామల వేగం పెరుగుతుంది. వీళ్లందరికీ టాలీవుడ్ నిర్మాతలు అధిక పారితోషికం ఇచ్చి మరీ తీసుకొచ్చారు.
బాలీవుడ్ లో చెల్లించే దానికంటే రెండు రూపాయలు ఎక్కువగా ఇచ్చి దిగుమతి చేసారు. ఇక్కడ సినిమా హిట్ అయితే గుర్తింపు తారా స్థాయికి చేరుతుంది! అన్న ఉత్సాహంతోనూ భామలు ఎంట్రీ ఇస్తున్నారు. మొదట్లో ఎందుకులే టాలీవుడ్ కి అనుకన్నా! ఇప్పుడు ఇదే బెటర్ గా ఉందన్న గుసగుస తెరపైకి వస్తుంది.
పాపులర్ బ్యూటీలకు ఇక్కడ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గౌరవ-మర్యాదలు గొప్పగా దక్కుతాయి. కాస్టింగ్ కౌచ్ లాంటి వి ఉండవు. సినిమా మొదలైన దగ్గర నుంచి ముగించి వెళ్లే వరకూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.
ఇక్కడున్నంత కేరింగ్ ఇంకే భాషలోనూ ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సమీకరణాలే సొంత పరిశ్రమపై బాలీవుడ్ బామల్లో అసంతృప్తి జ్వాలని రగిల్చినట్లు వినిపిస్తుంది. లోలోపల బాలీవుడ్ పై ఉన్న అక్కసునంతటిని వెళ్లగక్కుతున్నారుట. ఇంతకాలం మంచి వేదికని మిస్ అయ్యాం అనే భావనలో ఉన్నారుట భామలంతా.