ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ కు బాలీవుడ్ హీరో

Fri Mar 17 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

Bollywood Hero For NTR 30 Film

ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ కీలకపాత్రలో నటించిన ఆచార్య సినిమా విడుదలై పోయింది. ఇప్పుడు రాంచరణ్ 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాని అనౌన్స్ చేసి ఎన్నో రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం మీద క్లారిటీ లేదు.ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తాడు అనుకున్నప్పటికీ కొరటాల శివ రంగంలోకి దిగాడు. అయితే ఈ సినిమా మార్చిలో మొదలు పెడతామని ఆస్కార్ అవార్డుల వేదికగా జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సినిమా షూటింగ్ మార్చి 29వ తేదీ నుంచి మొదలు కాబోతున్నట్లు చెప్పారు. అయితే ప్రారంభోత్సవం మాత్రం మార్చి 18వ తేదీన ప్లాన్ చేస్తున్నారని సినిమా ఓపెనింగ్ కి ఒక బాలీవుడ్ స్టార్ యాక్టర్ కూడా రాబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

నిజానికి ఈ సినిమాలో ఒక బాలీవుడ్ నటుడు విలన్ పాత్రలో నటించబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్.

ఆయనే సినిమాలో విలన్ గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండడంతో పాటుగా ఇప్పుడు ప్రారంభోత్సవానికి ఆయన కూడా హాజరు కాబోతున్నారని ప్రచారం తెర మీదకు వచ్చింది. ఒకవేళ నిజంగానే సినిమా ఓపెనింగ్ ఆయన వస్తే విలన్ గా కూడా ఆయన నటిస్తున్నాడు అనే విషయం క్లారిటీ వచ్చేస్తుందని అంటున్నారు.

ఇక ఈ మధ్యనే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుందని క్లారిటీ ఇవ్వగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్నాడని కూడా ముందే ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.