Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో వారికి క్లీన్ చిట్ ఇవ్వనున్నారా...?

By:  Tupaki Desk   |   30 Sep 2020 9:50 AM GMT
డ్రగ్స్ కేసులో వారికి క్లీన్ చిట్ ఇవ్వనున్నారా...?
X
బాలీవుడ్ లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. దీపికాతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను కూడా ఎన్సీబీ విచారించింది. 2017లో దీపికా - కరిష్మా ప్రకాష్ - టాలెంట్ మేనేజర్ జయ సాహాలు కలిసి ఉన్న వాట్సాప్ గ్రూప్ లో 'మాల్' 'హ్యాష్' 'వీడ్' 'డూబ్' గురించి డిస్కస్ చేసినట్లు బయటపడటంతో.. వీరికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలు తెలుసుకోడానికి ఎన్సీబీ విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణలో వాట్సాప్ చాట్ గురించి అంగీకరించిన దీపికా.. మాల్ - హ్యాష్ - వీడ్ - డూబ్ అనేవి వివిధ రకాల సిగరెట్లకు మేము సరదాగా పెట్టుకున్న కోడ్ నేమ్స్ అని.. చాటింగ్ లో వాటి గురించే మాట్లాడుకున్నామని.. తాను డ్రగ్స్ ఎప్పుడు తీసుకోలేదని ఎన్సీబీ అధికారి తెలిపినట్లు 'టైమ్స్ నౌ న్యూస్' పేర్కొంది.

'మాల్‌' అంటే తక్కువ నాణ్యత గల సిగరెట్స్ అని.. 'హ్యాష్' 'వీడ్‌' అంటే నాణ్యత గల స్లిమ్‌ సిగరెట్స్ అని.. 'డూబ్' అంటే మందపాటి సిగరెట్స్ అని ఇద్దరూ వెల్లడించినట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించినట్లు సదరు ఛానల్ పేర్కొంది. దీపికా - కరిష్మా ప్రకాష్ లను ఇద్దరినీ వేర్వేరు గదులలో ప్రశ్నించినా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అలానే దీపికా - కరిష్మా ప్రకాష్ లు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు భావించినట్లు పేర్కొన్నారు. మరోవైపు డ్రగ్స్ లో శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ లను కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. ఈ విచారంలో వీరిద్దరూ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తి మరియు సుశాంత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాటింగ్ ఆధారంగా శ్రద్ధా - సారా లను విచారించారు. ఈ నేపథ్యంలో దీపికా పదుకొనే - శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ - కరిష్మా ప్రకాష్ లకు దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినట్లేనని నిన్న (మంగళవారం) ఎన్‌ సిబి అధికారి చెప్పినట్లు 'టైమ్స్ నౌ న్యూస్' కథనం ప్రసారం చేసింది.