Begin typing your search above and press return to search.

మన జక్కన్నపై బాలీవుడ్‌ డైరెక్టర్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:00 AM GMT
మన జక్కన్నపై బాలీవుడ్‌ డైరెక్టర్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి పేరు ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగుతూనే ఉంది. అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలు గత కొన్నాళ్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై పెద్ద ఎత్తున కథనాలు ఇస్తూనే ఉన్నాయి. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్‌ కి నామినేట్‌ అవ్వడంతో మరింతగా జక్కన్న యొక్క పేరు మారు మ్రోగుతోంది అనడంలో సందేహం లేదు.

ఎంతో మంది ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్ కూడా జక్కన్న రాజమౌళి పై ప్రశంసలు కురిపించడం జరుగుతోంది. బాలీవుడ్‌ లోనే దిగ్గజ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌. ఇండియాలోనే గొప్ప దర్శకుల్లో ఆయన ఒకడు. ఆయన తీసిన సినిమాలో ఒక అద్భుతం అన్నట్లుగా ఆయన అభిమానులు అంటూ ఉంటారు. అలాంటి అనురాగ్‌ కశ్యప్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో జక్కన్న ను ఆకాశానికి ఎత్తేల వ్యాఖ్యలు చేశాడు.

రాజమౌళి మన ఇండియన్ సినిమాలను హాలీవుడ్‌ వారికి కూడా నచ్చే విధంగా తీశాడు. అది కూడా తక్కువ బడ్జెట్‌ లో హాలీవుడ్‌ వారికి నచ్చే విధంగా సినిమాలు తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకే ఇండియన్‌ సినిమాలు అంటే ఇప్పుడు హాలీవుడ్ వారికి చాలా ఆసక్తి క్రియేట్‌ అయ్యిందని అనురాగ్‌ కశ్యప్ పేర్కొన్నాడు.

ఇకపై హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ తమ సినిమాల యొక్క మేకింగ్‌ కోసం తప్పనిసరిగా రాజమౌళిని సంప్రదిస్తారు అని తాను భావిస్తున్నాను అన్నట్లుగా కూడా పేర్కొన్నాడు. రాజమౌళి మార్వెల్‌ మరియు డీసీ సినిమాలను తీయగల సమర్ధుడు అంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలను అనురాగ్‌ కశ్యప్ చేయడం జరిగింది. రాజమౌళి యొక్క స్టామినా ఏంటో అనురాగ్‌ కశ్యప్ యొక్క వ్యాఖ్యలను చూస్తే అర్థం అవుతోంది.