బ్రేకప్ అన్నారు! ఇంతలోనే ఇలా కార్ లో దొరికిపోయారు!!

Sat May 28 2022 09:00:01 GMT+0530 (IST)

Bollywood Celeb Couple in Car

దర్శకనిర్మాత కరణ్ జోహార్ ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్ లో తన 50వ పుట్టినరోజు వేడుకను వైభవంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక ఆద్యంతం జంటలు రక్తి కట్టించాయి. పార్టీలో సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీ సహా పరిశ్రమ నుండి ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే ఈ పార్టీకి సిద్ధార్థ్ - కియారా కలిసి రాకపోవడంపై రకరకాలుగా చర్చ సాగింది. కానీ పార్టీ అయిపోయాక ఈ జంట ఒకే కారులో వేదిక వద్ద నుండి బయలుదేరిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.ఒక అభిమాని తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ ఇద్దరూ కలిసి కనిపించారు. పార్టీ అయ్యాక అక్కడి నుండి కార్ లో బయలుదేరిన ఈ జంటను ఫోటోగ్రాఫర్లు వెంటపడి మరీ ఫోటోలు తీసారు. సిద్ధార్థ్- కియారా ఒకరితో ఒకరు ఆ సమయంలో సంభాషణలలో నిమగ్నమై ఉన్నారు. కార్ లో కూచుని కనిపించారు. ఈవెంట్ కోసం కియారా తెల్లటి బ్లేజర్ తో మెరిసే బాడీకాన్ దుస్తులను ధరించింది. పార్టీ థీమ్-బ్లింగ్ ను అనుసరించి సిద్ధార్థ్ పూర్తిగా నలుపు రంగు టక్సేడోలో అందంగా కనిపించాడు.

కియారా- సిద్ధార్థ్ లు డేటింగ్ లో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. అనంతరం విడిపోయారని కూడా ప్రచారం చేసేసారు. కానీ ఆ ఇద్దరూ తమ లవ్ లైఫ్ ని ఏనాడూ బహిర్గతం చేయలేదు.

తమపై పుకార్లపై ఏనాడూ స్పందించలేదు. తమ సంబంధంపై నోకామెంట్స్ అన్నట్టే వ్యవహరించారు. కొంతకాలం క్రితం బ్రేకప్ కథనాలు యథావిధిగా ఇంటర్నెట్ లో షికార్ చేసాయి. దానిపైనా స్పందన లేదు. ఇక ఇటీవల డెవలప్ మెంట్స్ పైనా అభిమానుల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది.

సిద్ధార్థ్ ఇటీవల ముంబైలోని ఫిల్మ్ సిటీలో కియారాను కలుసుకునేందుకు బయలుదేరినప్పటి ఫోటోలు వైరల్ అయ్యాయి. అతను నేరుగా కియారా వ్యానిటీ వ్యాన్ వైపునకు తన కార్ లో వెళుతూ కనిపించాడు. ఇదే కాకుండా కియారా అద్వానీ - కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా 2 ప్రత్యేక ప్రదర్శనకు కూడా సిద్ధార్థ్ హాజరయ్యాడు. కియారాను పలకరించినప్పుడు అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈవెంట్ లో కియరాను కౌగిలించుకుని కనిపించాడు. ఈ జంట 'షేర్ షా' మూవీలో కలిసి నటించారు. ఆ సినిమాలో ఇద్దరి నటనకు పేరొచ్చింది. అప్పట్లోనే ఎఫైర్ వార్తలో జోరుగా వినిపించాయి.

సిద్ధార్థ్ తదుపరి రోహిత్ శెట్టి  వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ లో కనిపించనున్నాడు. కియారా ఇటీవల 'భూల్ భూలయ్యా 2'లో కనిపించింది. ప్రస్తుతం జగ్ జగ్ జీయో విడుదలకు సిద్ధమవుతోంది. ధావన్ తో కలిసి ఈ మూవీకి ప్రచారం చేస్తోంది కియరా. ఈ చిత్రంలో వరుణ్ ధావన్- నీతూ కపూర్ -అనిల్ కపూర్ తదితరులు నటించారు.