Begin typing your search above and press return to search.
#గుసగుస.. సిగరెట్ లేనిదే జీవితం గడవదు!
By: Tupaki Desk | 31 Jan 2023 6:00 PMపొగ తాగడం ఆరోగ్యానికి హానికరం! పొగాకు క్యాన్సర్ కారకం అంటూ థియేటర్లలో జనగనమణకు ముందు బోలెడంత ప్రచారం సాగుతుంది. ఆ ప్రకటన ప్రతిసారీ రిపీటెడ్ గా వేయడంతో అది ఒక పాఠంలా కొందరికి కంఠతా వచ్చేసింది. పదే పదే రిపీటెడ్ గా స్క్రీన్ పై కనిపిస్తుండడంతో కొందరికి అది ఇర్రిటేషన్ కూడా తెచ్చింది.
అయితే పొగతాగే హీరోలను రొటీన్ గా చూస్తాం కానీ పొగ తాగే మగువను చూసేది చాలా అరుదు. ఆ రోజుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు చుట్ట కాల్చేవారు. ధూమపానాన్ని ఆస్వాధించేవారు. కానీ ఈరోజుల్లో అల్ట్రా మోడ్రన్ బ్యూటీస్ సిటీలో లభించే ఫైనెస్ట్ బ్రాండ్ సిగరెట్లను పబ్లిక్ లో రింగురింగులుగా పొగ వదులుతూ తాగేందుకు ఇష్టపడుతున్నారు.
టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ లలో సిగరెట్ వెలిగించడంలో ఘనాపాటీలు ఎందరున్నారు? అన్నది ఆరా తీస్తే.... తెలుగు వారికి భాగ్యలక్ష్మిగా సుపరిచితురాలైన శ్రుతిహాసన్ సిగరెట్ దమ్ము కొట్టడంలో స్పెషలిస్ట్. శ్రుతి సోదరి అక్షర కూడా ఇంతకుముందు సిగరెట్ తాగుతూ కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ముంబై పరిశ్రమలో సిగరెట్ తాగడం అన్నది షరామామూలు.
బాలీవుడ్ తారలు స్మోకింగ్ లేదా డ్రింకింగ్ వంటి మత్తును సేవిస్తూ తెరపై అలరించడాన్ని తరచుగా చూస్తుంటాం. ఇది ఆరోగ్యానికి హానికరం అని పొగాకు తయారీదారులు చట్టబద్ధమైన హెచ్చరికను జారీ చేస్తారు. మేల్ స్టార్స్ మాత్రమే కాదు..కొందరు మహిళా తారలు నిజ జీవితంలోనూ ధూమపానానికి అలవాటు పడ్డారు. అలాంటి చెడు వ్యసనానికి బానిసలైన ఐదుగురు బాలీవుడ్ నటీమణుల్లో కంగనా రనౌత్- సుస్మితా సేన్- కొంకణా సేన్- అమీషా పటేల్- రాణి ముఖర్జీ ఉన్నారు.
కంగనా రనౌత్ 19 సంవత్సరాల వయస్సులో చైన్ స్మోకర్ అన్న సంగతిని ఇదివరకూ వెల్లడించింది. `వో లమ్హే` షూటింగ్ సమయంలో తను స్మోకింగ్ కు అలవాటు పడింది. రోజుకు 10-12 సిగరెట్లు తాగేదట. తర్వాత అది కంటిన్యూ అయ్యింది.
ప్రియాంక చోప్రా చైన్ స్మోకర్. ఇప్పటికీ స్మోకింగ్ అలవాటు ఉంది. పీసీ ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్ కూడా ధూమపానం చేసింది. ఆమె తన భర్త నిక్ జోనాస్ తో కలిసి సిగరెట్ సేవిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
ప్యారడైజ్ స్ట్రీట్‌లో వేశ్య పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో అమీషా పటేల్ ధూమపానం చేయడానికి ప్రయత్నించింది. తనకు స్మోకింగ్ అలవాటు లేదని ఆమె చెప్పినా చాలాసార్లు స్మోకింగ్ చేస్తూ కెమెరా కంటికి పట్టుబడింది.
సుస్మితా సేన్ చాలాసార్లు పొగ రింగురింగులుగా వదులుతూ పబ్లిక్ గా కనిపించింది. తాను ఇలాంటి పోష్ జనరేషన్ జీవనశైలిని ఎంచుకున్నానని.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేస్తానని చెప్పింది.
రాణి ముఖర్జీ తనకు ధూమపానం విపరీతమైన హాబీ అని వెల్లడించింది. సిగరెట్ లేకుండా దినచర్య ప్రారంభం కాదు. ధూమపానం జీర్ణక్రియకు సహాయపడుతుందని రాణీ చెప్పింది.
కొంకణా సేన్ శర్మకు తీవ్రమైన ధూమపాన వ్యసనం ఉండేది. ఆమె గర్భం దాల్చడం వల్ల ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం స్మోకింగ్ పూర్తిగా మానేసింది. టాలీవుడ్ లో పలువురు అందాల కథానాయికలు సిగరెట్ వెలిగించేందుకు ఏమాత్రం భేషజం ప్రదర్శించరు. ఫిలింనగర్ కృష్ణానగర్ లో డ్యాన్సర్లు.. జూ.ఆర్టిస్టులు సహా చాలా మంది సిగరెట్ స్మోకింగ్ లో ఆరితేరిపోయిన భామలు ఉన్నారనేది ఒక అధ్యయనం. పెగ్గేశాక సిగరెట్ స్మోక్ చేస్తే ఆ కిక్కే వేరని పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇది ఉపకరిస్తుందని భావించే ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.