బాబీ భలే ఛాన్స్ కొట్టేశాడు.. మళ్లీ మెగా మూవీ కన్ఫర్మ్

Mon Feb 06 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

Bobby took a chance.. Mega movie confirmed again

రవితేజ పవర్ సినిమా తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టిన దర్శకుడు బాబీ రెండవ సినిమాతోనే పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశంను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ని కూడా డైరెక్ట్ చేసే అవకాశం ను బాబీ సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ను మూడు విభిన్నమైన పాత్రల్లో చూపించి జై లవకుశ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు.తాజాగా సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా తో బాబీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిన్న వయసు లోనే తక్కువ సినిమాల అనుభవంతోనే బాబీకి ఏకంగా చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం రావడం జరిగింది. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా అందులోనే రెండు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ తో అవ్వడంతో మెగా ఫ్యాన్స్ కు బాబీ చేరువయ్యాడు.

ఇప్పుడు మరోసారి మెగా హీరోతోనే వర్క్ చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవికి దర్శకుడు బాబీ ఒక కథ చెప్పాడట.

ఆ కథ ను చిరంజీవి కాకుండా మెగా హీరోల్లో ఎవరితోనైనా చేయాలని నిర్ణయించుకున్నారట.

ఇప్పటికే చిరంజీవి కూడా ఆ స్టోరీ లైన్ కు ఫిదా అయ్యాడని.. ప్రస్తుతం పూర్తి స్థాయి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా యొక్క సక్సెస్ జోష్ ను ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు బాబీ త్వరలోనే ఆ మెగా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట.

ప్రస్తుతానికి రామ్ చరణ్ చాలా బిజీగా ఉన్నాడు.. కనుక ఆ సినిమా చరణ్ కాకుండా వరుణ్.. వైష్ణవ్ తేజ్ లేదా సాయి ధరమ్ తేజ్ లతో అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాబీ ఎంపిక చేసుకోబోతున్న ఆ మెగా హీరో ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే బాబీ తదుపరి సినిమా మెగా కాంపౌండ్ హీరోతో అని విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.