Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమాలో మరో స్టార్...?

By:  Tupaki Desk   |   13 Aug 2020 3:39 PM GMT
మెగాస్టార్ సినిమాలో మరో స్టార్...?
X
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఆచార్య' కరోనా కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. 'ఆచార్య' తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు మెహర్ రమేష్ మరియు బాబీ (కేఎస్ రవీంద్ర) లతో కూడా మెగాస్టార్ సినిమాలు చేయనున్నాడు. అయితే బాబీ తో చేయనున్న ప్రాజెక్ట్ గురించి చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

కాగా బాబీ దర్శకత్వంలో వచ్చిన 'వెంకీ మామ' గతేడాది చివర్లో రిలీజైన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన మెగాస్టార్.. వెంకటేష్ - నాగచైతన్య లను బాబీ స్క్రీన్ మీద చూపించిన విధానాన్ని మెచ్చుకున్నాడట. అంతేకాకుండా తనకు కూడా ఓ మల్టీస్టారర్ స్టోరీ రెడీ చేయమని చెప్పాడట. చిరు స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత ఇతర హీరోలతో కలిసి నటించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒకటి అర సినిమాల్లో కనిపించినా అవి గెస్ట్ రోల్స్ గా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో బాబీ చిరంజీవి కోసం ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ రెడీ చేసాడట. ఇప్పటికే మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం మరో హీరోని వెతికే పనిలో పడ్డారట. అయితే మెగా మల్టీస్టారర్ కోసం మెగా హీరోనే తీసుకుంటారా లేదా ఇతర హీరోలను ఫైనలైజ్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ కి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మెగాస్టార్ బర్త్ డే వరకు ఆగాల్సిందే.