బిత్తిరి సత్తిని ఆటపట్టించిన వెంకీ!

Tue May 24 2022 16:02:45 GMT+0530 (IST)

Bithiri Sathi Interview With F3 Team

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. అనిల్ రావిపూడిని బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. ఆయన ప్రశ్నలకు వెంకటేశ్ స్పందిస్తూ .. "ఈ సినిమాలో నాకు రేచీకటి ఉంటుంది. ఆ సమయంలో నేను ఇచ్చే సలహాలు వినడం వలన వరుణ్ ఇబ్బందులు పడుతుంటాడు. ఇక్కడే కావలసినంత  కామెడీ పండుతుంది.మల్టీస్టారర్ లు ఎక్కువగానే చేశాను .. అయితే వాటన్నిటికీ భిన్నమైనదిగా ఈ సినిమాను గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది .. ఆర్టిస్టులంతా కూడా చాలా బాగా చేశారు. అనిల్ రావిపూడి డైలాగ్స్ బాగా రాశాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ నవ్వుతూనే ఉంటారు. కోవిడ్ తరువాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఇలాంటి సినిమా రాలేదు.  ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే సినిమా ఇది. ఫ్యామిలీలోని అన్ని వయసుల వారు ఎంజాయ్ చేసే సినిమా ఇది అని చెప్పారు.

ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "చాలామంది కమెడియన్స్ కాంబినేషన్లో చేసిన సినిమా ఇది. ఒక సీన్ ను సెట్ చేయడం అంత తేలికైన విషయమేం కాదు. కానీ ఆర్టిస్టుల సహకారంతో నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే చేయగలిగాను. తమన్నా .. మెహ్రీన్ ఉన్నప్పటికీ సోనాల్ చౌహాన్ ను పెట్టడం జరిగింది.

ఆ పాత్ర ఎలా ఉంటుంది? ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది? అనేది మాత్రం సర్ ప్రైజ్. అందుకే ఇంతవరకూ ఆ పాత్రను గురించిన విషయాలను ఎక్కడా కూడా రివీల్ చేయడం జరగలేదు. కామెడీతో పాటు మంచి మెసేజ్  కూడా ఉంటుంది" అని అన్నాడు.

ఇక వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. 'ఎఫ్ 2' చేసిన ధైర్యంతోనే  'ఎఫ్ 3' చేసుకుంటూ వెళ్లాను. నేను కూడా కామెడీ బాగా చేశానని అంతా అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఇక చిలక ఫ్లైయింగ్ లో ఉందనీ .. దానికీ తనకి బ్లూటూత్ కనెక్షన్ ఉందంటూ బిత్తిరి సత్తి చెప్పిన చిలక జోష్యం బాగుంది.

అనిల్ రావిపూడి మనసులో ఏవుందని చిలకనడుగుతూ తమన్నా .. పూజ హెగ్డే ఫొటోలను బయటికి తీయడం వెంకటేశ్ మనసులో ఏవనుకుంటున్నారు? అంటూ దిల్ రాజు ఫొటోలు బయటికి తీయడం .. అలాగే వరుణ్ తేజ్ విషయానికి వచ్చేసరికి  పెళ్లి - మంచం ఫొటోలు తీసి  పిలగాడు ఇక ఆగేట్టులేడు నాగబాబుగారు అంటూ నవ్వులు పూయించాడు. బిత్తిరి సత్తిరి మాదిరిగా ప్రతి పదాన్ని 'ఫ'కారంతో పలుకుతూ ఆయనను వెంకటేశ్ ఆటపట్టించడం మరింత రక్తి కట్టించింది.