రామ్ చరణ్ నుంచి బర్త్ డే సర్ప్రైజ్

Fri Mar 17 2023 09:13:43 GMT+0530 (India Standard Time)

Birthday surprise from Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ మూవీని ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ మూవీ ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి పాత్రలు ఎక్కడా కలుసుకోవడం జరగదు. పీరియాడిక్ జోనర్ లో ఫ్లాష్ బ్యాక్ స్టొరీని చెప్పి ప్రెజెంట్ లో కొడుకు కథని దర్శకుడు శంకర్ చూపించబోతున్నాడు. ఈ మూవీలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మూవీకి మరింత హైప్ వచ్చింది అని చెప్పాలి. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ఫోకస్ అంతా ప్రస్తుతం దీనిమీదనే ఉంది. శంకర్ సినిమా అంటే ఆ గ్రాండియర్రిచ్ నెస్ మూవీలో ఎలాగు ఉంటుంది. ఇదిలా ఉంటే మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు రాబోతుంది.

 ఈ సందర్భంగా ఆర్.సీ.15 నుంచి మెగా అభిమానులకి అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని దర్శకుడు శంకర్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని ఆ రోజు అనౌన్స్ చేసే అవాకాశం ఉందంట. అదే సమయంలో ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా ఆ రోజు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట. ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గా ఆ రోజు ఆర్.సీ 15 ట్రీట్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారంట.

ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో చేస్తున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మరల రామ్ చరణ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. మరి శంకర్ రామ్ చరణ్ కోసం ఎలాంటి టైటిల్ ని ఫైనల్ చేశారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.