ఫొటోటాక్ : భర్తతో బర్త్ డే రొమాంటిక్ కిస్

Sun Sep 20 2020 11:00:31 GMT+0530 (IST)

PhotoTalk: Birthday Romantic Kiss With Husband

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన శ్రియ ఈమద్య కాలంలో కాస్త తగ్గింది. రెండేళ్ల క్రితం ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్ తో పెళ్లి తర్వాత కూడా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను వినియోగించుకుంటూ శ్రియ ముందుకు వెళ్తుంది. సినిమాలు లేని సమయంలో భర్తతో కలిసి విదేశీ ప్రయాణాలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. భర్తతో గడిపే టైం ను ఈమద్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న శ్రియ తాజాగా తన బర్త్ డే కు సంబంధించిన వీడియో మరియు ఫొటోలను షేర్ చేసింది.బర్త్ డే సందర్బంగా హాలీడేకు వెళ్లిన శ్రియ మరియు ఆండ్రీ కోస్చీవ్ లు రొమాంటిక్ గా ఎంజాయ్ చేసినట్లున్నారు. భర్త తనకు ఎంతో ప్రేమగా పెదాలపై ముద్దు పెట్టడంను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. రొమాంటిక్ ముద్దు ఫొటోతో పాటు ఒక క్యూట్ వీడియోను కూడా షేర్ చేసింది. అందులో కూడా శ్రియ పెదాల పై ఆండ్రీ కోస్చీవ్ ముద్దు పెట్టాడు. ఇద్దరి మద్య ఉన్న ప్రేమను ఆ మద్దులు తెలియజేస్తున్నాయి. అతడితో శ్రియ చాలా సంతోషంగా ఉందని ఈ ఫొటోలు వీడియోలు చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే గమనం సినిమాతో పాటు ఆర్‌ఆర్‌ఆర్ సినిమలో కూడా నటిస్తుంది. ఇంకా ఈమె ఇతర భాషల్లో కూడా నటిస్తోంది.