నీరు-ఆకాశం కలిసే చోట బిపాసా-కరణ్ సెలబ్రేషన్

Tue Feb 23 2021 22:00:01 GMT+0530 (IST)

Bipasa Basu In Maldives

ఓవైపు మహమ్మారీ క్రైసిస్ కొనసాగుతున్నా.. మాల్దీవుల్లో విహరించేందుకు ఏమాత్రం భయపడలేదు సెలబ్రిటీ కపుల్స్. కాజల్ -గౌతమ్ కిచ్లు- నాగార్జున - అమల.. నాగచైతన్య- సమంత జంటలు మాల్దీవుల్లో విహరించారు.బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌతమ్ కిచ్లుతో కాజల్ సడెన్ పెళ్లి అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాజల్ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని క్షణాలు మాల్దీవుల్లోనే అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ విహారానికి సంబంధించిన ప్రతి ఫోటో వీడియో అభిమానుల్లో వైరల్ అయ్యాయి. నాగచైతన్య - సమంత జంట కూడా అక్కడ బ్లూవాటర్స్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ని ఆస్వాధించారు. జంట సెలబ్రేషన్ సహా సామ్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. నాగ్ -అమల జంట వెళ్లినా సైలెంట్ గా ఈ సెలబ్రేషన్ ని కానిచ్చేయడంతో పెద్దగా ఫోటోలేవీ వైరల్ కాలేదు.

ఇక ఇతర  పరిశ్రమల నుంచి జంటలు జంటలుగా మాల్దీవుల సెలబ్రేషన్స్ కి వెళ్లారు. అందులో సిద్ధార్థ్ మల్హోత్రా- కియరా అద్వాణీ.. ఇషాన్ ఖత్తర్- అనన్య పాండే జంటలు మాల్దీవుల్లో విహరించారు. అక్కడ టూరిజానికి సెలబ్రిటీ బూస్ట్ కోసం ప్రత్యేక ప్యాకేజీల్ని ఆఫర్ చేయడంతో ఎవరూ ఆ అవకాశాన్ని విడిచిపెట్టలేదు.

ఇప్పుడు కాస్త ఆలస్యమైనా.. బిపాషా బసు తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి మాల్దీవుల విహారంలో ఉన్నారు. అక్కడ కరణ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తున్నారు ఈరోజు. మంగళవారం ఉదయం బిపాసా బసు తన భర్తకు ఇన్ స్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలిపారు. ``సంవత్సరంలో నా 2వ అత్యంత ఇష్టమైన రోజు ఇదిగో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. కరణ్ సింగ్ గ్రోవర్ పుట్టినరోజు నేడు. ఐ లవ్ యు`` అంటూ వ్యాఖ్యానం జోడించారు బిపాసా.

``నీరు ఆకాశాన్ని ఎక్కడ కలుస్తుంది? మీరు - నేను అక్కడే కలిసాం`` అంటూ బిప్స్ కవితల్ని అల్లింది.  #monkeylove అన్న హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. బిపాసా ఇటీవల బాలీవుడ్ లో నటించడం లేదు. అయితే భర్త కరణ్ తో కలిసి టీవీ ప్రొడక్షన్ లో అడుగుపెట్టారు. సొంతంగా సినిమాల్ని నిర్మిస్తున్నారు. బిపాసా టాలీవుడ్ లో టక్కరిదొంగ (మహేష్) చిత్రంలో నటించిన సంగతి తెలిసినదే.