భారీ ఆఫర్ కు మొగ్గుతున్న బయోపిక్ మేకర్స్

Sun Aug 02 2020 18:30:07 GMT+0530 (IST)

Biopic makers leaning towards a huge offer

నాలుగు నెలలుగా థియేటర్లు లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలకు సిద్దం అవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలకు సిద్దం అయినా థియేటర్ల ఓపెన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో రూపొందిన ‘83’ చిత్రం కూడా విడుదలకు సిద్దం అయ్యి చాలా కాలం అయ్యింది. థియేటర్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అంటూ ఆ చిత్ర మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంకు మొదటి నుండి ఓటీటీల ద్వారా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపించని ‘83’ మేకర్స్ ఇప్పుడు అమెజాన్ ఇచ్చిన ఆఫర్ తో మొగ్గుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.థియేటర్ లో విడుదల చేసినా వస్తాయో రావో అన్నంత అమౌంట్ ను అమెజాన్ ఆఫర్ చేసిందట. దాంతో 83 మేకర్స్ ఎందుకు ఓటీటీ ద్వారా విడుదల చేయకూడదు అనే పాయింట్ పై చర్చలు జరుపుతున్నారట. అంతా ఓకే అనుకుంటే ఖచ్చితంగా 83 చిత్రంను త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసే అవకాశం ఉంది. థియేటర్ లో విడుదల చేయాలంటే మరో రెండు మూడు నెలలకు పైగా వెయిట్ చేయాల్సి రావచ్చు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అమెజాన్ విడుదలకు ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు.

1983లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ లో టీం ఇండియా తరపున ఆడిన కపిల్ టీమ్ అనూహ్యంగా విజేతగా నిలిచింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలు జట్టులో ఉన్న పరిస్థితులను చూపిస్తూ 83 చిత్రాన్ని తెరకెక్కించారు. జట్టు కెప్టెన్ గా ఉన్న కపిల్ దేవ్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. ఆ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషించగా హీరోయిన్ గా దీపిక పదుకునే నటించింది. ఈ చిత్రం కోసం క్రీడాభిమానులు మరియు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.