Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 100వ జయంతి.. కళ్యాణ్ రామ్‌ గిఫ్ట్‌ ఇదే

By:  Tupaki Desk   |   28 May 2022 12:32 PM GMT
ఎన్టీఆర్‌ 100వ జయంతి.. కళ్యాణ్ రామ్‌ గిఫ్ట్‌ ఇదే
X
నందమూరి తారక రామారావు వందవ జయంతి సందర్బంగా అభిమానులు మరియు ఆయన కుటుంబ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో మరియు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానుల కోసం బాలకృష్ణ తన సినిమా పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్‌ ను జయంతి సందర్బంగా రివీల్‌ చేస్తాడని అంతా భావించారు.

టైటిల్‌ ను రివీల్‌ చేయకుండానే ఒక పవర్‌ ఫుల్‌ పోస్టర్ ను విడుదల చేసి అన్నగారి జయంతి కానుకను బాలకృష్ణ ఇవ్వడం జరిగింది. ఇక తాత వందవ జయంతి సందర్బంగా నందమూరి కళ్యాణ్ రామ్‌ తన మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ బింబిసార యొక్క పవర్ ఫుల్‌ పోస్టర్‌ ను విడుదల చేశాడు. పోస్టర్ సినిమాపై చాలా అంచనాలు పెంచే విధంగా ఉందంటూ నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కళ్యాణ్‌ రామ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్న బింబిసార మూవీ సోషియో ఫాంటసీ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విభిన్నమైన పోస్టర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన కళ్యాణ్ రామ్‌ తాజాగా షేర్‌ చేసిన ఈ పోస్టర్ తో సినిమాపై ఆసక్తి మరింతగా పెరగడంతో పాటు కళ్యాణ్ రామ్‌ గతంలో ఎప్పుడు కనిపించనంత స్టైలిష్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడనే చర్చ జరుగుతోంది.

వశిష్ఠ్‌ దర్శకత్వంలో హరికృష్ణ కే తో కలిసి కళ్యాణ్ రామ్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చరిత్ర మర్చిపోయిన.. చరిత్ర లో లేని బింబిసార అనే రాజు గురించి.. ఆయన పతనం గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మొదట్లోనే ప్రకటించారు. ఆ కథకు తోడు ఈ జనరేషన్‌ స్టోరీ కూడా సాగుతుంది. బింబిసార రాజు మరియు ఈతరం స్టైలిష్‌ మ్యాన్‌ లుక్ లో కళ్యాణ్ రామ్‌ కనిపించబోతున్నాడు.

ఎన్టీఆర్‌ వందవ జయంతి సందర్బంగా నందమూరి ఫ్యామిలీ నుండి మరో హీరో సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా వచ్చింది. చైతన్య కృష్ణ హీరోగా ఒక సినిమా ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్‌ సినిమాల అప్‌డేట్స్ కోసం కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ రామ్‌ మరియు బాలయ్య ఇచ్చిన గిఫ్ట్‌ లతో ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలు మరింత వైభవంగా మారినట్లు అయ్యాయి.