రెండింటిపై మీమ్స్ అదిరాయిగా!

Fri Aug 05 2022 16:04:11 GMT+0530 (India Standard Time)

Bimbisara SitaRamam Movie Memes

థియేటర్లలోకి కొత్త సినిమా వచ్చేస్తోందంటే మీమ్స్ రాయుళ్లకు పండగే. ఆయా సినిమాలకు సింక్ అయ్యే పాత్రలని సినిమా స్టిల్స్ ని వాడేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. నెట్టింట వైరల్ చేస్తుంటారు.ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైన రెండు క్రేజీ సినిమాపై కూడా ఇదే తరహా మీమ్స్ తో మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోయారు. తమదైన స్టైల్లో పంచ్ లు వేస్తూ సందడి చేశారు. అందులో ఒకటి పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా 'బింబిసార'. మరొకటి 'సీతా రామం'. ఇది కూడా పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామానే కానీ ఇది క్లాస్ మూవీ. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈమూవీని రూపొందించారు.

ఇక 'బింబిసార' కంప్లీట్ మాస్ బొమ్మ. పీరియాడిక్ నేపథ్యం వున్నా ఇది కూడా ఫిక్షన్ మూవీనే. టైమ్ ట్రావెల్ స్టోరీగా ఈ మూవీని అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కిచారు. 'బింబిసార'లో నందమూరి కల్యాణ్ హీరోగా నటించగా కేథరిన్ సంయుక్తమీనన్ వరీనా హుస్సేన్ హీరోయిన్ లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ ద్వారా యంగ్ టాలెంటెడ్ మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

'సీతా రామం'లో యూత్ లో మంచి క్రేజ్ వున్న దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. కీలక పాత్రల్లో నేషనల్ క్రష్ .. క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటించింది. ఇతర కీలక పాత్రల్లో సుమంత్ తరుణ్ భాస్కర్ గౌతమ్ మీనన్ కనిపించారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు భిన్నమైన నేపథ్యంలో సాగేవే. ఒకటి పక్కా మాస్ మూవీ అయితే మరొకటి పక్కా క్లాస్ లవ్ స్టోరీ.

ఈ రెండు సినిమాలకు మంచి బజ్ ఏర్పడింది. ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూలైలో విడుదలైన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లుగా డిజాస్టర్ లుగా నిలిచి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. దీంతో సగటు ప్రేక్షకుడు కథా బలమున్న విజువల్ ఫీస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. అలా ఎదురుచూసిన ప్రేక్షకులకు ఆశించిన స్టఫ్ తో స్వాగతం పలికాయి బింబిసార సీతారామం.  

ఈ నేపథ్యంలో వీటి ఫలితం ఎలా వుంటుందో అంటూ నెట్టింటి ఈ ఉదయం నుంచి ఆసక్తికరమైన మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. ప్రేక్షకులు ఆశించిన సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండటంతో అంతా ఇప్పడు ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేస్తుండటం విశేషం.