మళ్లీ ఇండస్ట్రీకి టాలెంటెడ్ డైరెక్టర్ ని అందించాడు!

Fri Aug 05 2022 19:00:01 GMT+0530 (IST)

The success of

నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి కొత్త దర్శకులతో సాహసాలు చేస్తూనే వున్నారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో కల్యాణ్ రామ్ హీరోగా పరిచయం అయిన మూవీ `తొలి చూపులోనే`. ఈ మూవీకి కాశి విశ్వనాథ్ దర్శకుడు. ఇది ఆయకూ తొలి సినిమానే. 2003లో వచ్చిన ఈ మూవీ ఫరవాలేదనిపించింది. ఇక ఆ తరువాత చేసిన `అభిమన్యు`తో మల్లిఖార్జున్ ని దర్శకుడిగా పరిచయం చేశారు. పెద్దగా ఆడలేదు. ఇక లాభం లేదనుకుని రెండేళ్లు విరామం తీసుకున్నారు.ఆ తరువాత సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ని ప్రారంభించిన కెరీర్ తో రిస్క్ గేమ్ ఆడి చేసిన సినిమా `అతనొక్కడే`. రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ద్వారా సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ లలో సరికొత్త బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కల్యాణ్ రామ్ కు హీరోగా నిర్మాతగా మంచి పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సొంతం చేసుకుని ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచారు.

`హరే రామ్`తో సక్సెస్ ని సొంతం చేసుకున్న కల్యాణ్ రామ్ మళ్లీ విజయాన్ని అందుకోవడానికి మళ్లీ కొత్త దర్శకుడినే నమ్ముకోవాల్సి వచ్చింది. అలా చేసి సినిమానే `పటాస్`. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీని స్వయంగా నిర్మించి నటించారు. వరుస ఫ్లాపుల్లో వున్న కల్యాణ్ రామ్ ని మళ్లీ సక్సెస్ ఫుల్ గా ట్రాక్ లోకి తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి కూడా స్టార్ డైరెక్టర్ల సరసన చేరిన విషయం తెలిసిందే.

అచితే `పటాస్` లాంటి బిగ్ కమర్షియల్ సక్సెస్ తరువాత కల్యాణ్ రామ్ ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారని చెప్పొచ్చు. అయిఏ ఎలాగైనా ఈసారి భారీ హిట్ ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఫైనల్ గా మరో కొత్త దర్శకుడు మల్లిడి వశిష్టను `బింబిసార`తో టాలీవుడ్ కు పరిచయం చేశాడు. అనుభవం లేని దర్శకుడు మార్కెట్ అంటూ పెద్దగా లేని హీరో.. చారిత్రక నేపథ్యంల వున్న ఫాంటసీ కథ. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్. ఇలాంటి కథని చేయడానికి ఎవరైనా భయపడతారు. కొత్త దర్శకుడు డీల్ చేస్తాడా? అని అనుమానిస్తారు.

కానీ కల్యాణ్ రామ్ మొండిగానే ముందుకెళ్లాడు. దర్శకుడు చెప్పిన లైన్‌పై అతని విజయ్ పై పూర్తి నమ్మకం పెట్టి కోట్ల రూపాయల బడ్జెట్ తో `బింబిసార`ని తెరపైకి తీసుకొచ్చి పెద్ద సాహసమే చేశాడు. ట్రైలర్ టీజర్ చూసిన వారంతా ఇంతే సినిమాలో సరుకేమీ వుండదు అంటూ కామెంట్ లు చేశారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ తను నమ్మకం పెట్టుకున్న వశిష్ట కొత్త దర్శకుడైనా తక్కువ బడ్జెట్ లోనే అద్భుతాన్ని సృష్టించలేకపోయినా ఆసక్తికర కథనంతో సినిమాని తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వశిష్ట కూపంలో ఈ సినిమాతో కల్యాణ్ రామ్ టాలీవుడ్ కు మరో మంచి దర్శకుడిని అందించాడని చెప్పొచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా మొండిగా ముందడుగు వేసిన కల్యాణ్ రామ్ లెక్క మరో సారి తప్పలేదని `బింబిసార` విజయంతో మరోసారి రుజువైంది.