బింబిసార రిజెక్ట్ చేసిన హీరో.. దర్శకుడు ఏమన్నాడంటే?

Fri Aug 12 2022 14:25:36 GMT+0530 (India Standard Time)

Bimbisara Director Vashist

సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమా కథలు అనేకమంది హీరోల చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఫైనల్ గా ఎవరో ఒకరు దానికి  సిగ్నల్ ఇచ్చిన తర్వాత సినిమా సక్సెస్ అయితే ఒక తరహాలో డిజాస్టర్ అయితే మరొక తరహాలో వార్తలు కూడా వస్తూ ఉంటాయి. ఇక రీసెంట్గా వచ్చిన బింబిసార సినిమా పై కూడా అదే తరహాలోకొనే కథనాలు వెలబడుతున్నాయి. నిజానికి దర్శకుడు విశిష్ట బింబిసార కంటే ముందు దర్శకుడు అవ్వాలని అనే ఆలోచనతోనే 8 ఏళ్ళ నుంచి కథలు చెప్పుకుంటు తిరుగుతున్నాడు.మొదటి అతను హీరోగా చేసి ఆ తర్వాత మళ్లీ దర్శకుడిగా యూ టర్న్ తీసుకుంటున్నాడు. అయితే తండ్రి మంచి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కావడంతో హీరోలతో అతనికి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి.

ఇక మొదట రవితేజ అల్లు శిరీష్ రామ్ పోతినేని అలాగే ఎన్టీఆర్ మంచు విష్ణు ఇలా కొంతమంది హీరోలతో వశిష్ట మంచి బాండింగ్ ఏర్పరచుకొని వాళ్లతో సినిమాలు కూడా చేయాలని అనుకున్నాడు. అయితే బింబిసారా కదా విషయానికి వచ్చేసరికి మొదట రవితేజకు చెప్పినట్లుగా కూడా టాక్ వచ్చింది.

ఇక రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని నేను 2019లో మొదట కథ అనుకోగానే కళ్యాణ్ రామ్ గారికి చెప్పాను అని వశిష్ట తెలియజేశాడు. అలాగే రవితేజకు చెప్పింది మరో కథ అని కూడా అనుకున్నాడు. ఇక నిజానికి దర్శకులు ఒక సినిమాను ఒక హీరోతో తెరపైకి తీసుకువచ్చిన తర్వాత ఇలాంటి టాపిక్స్ పై పెద్దగా బయటికి చెప్పుకోరు.

ఎందుకంటే వేరే హీరోలతో మనస్పర్ధలు రాకూడదు అనే కారణం కూడా ఉంటుంది. సినిమా కథ రవితేజ రిజెక్ట్ చేశాడు అనేది ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్. కానీ వశిష్ట మాత్రం తాను కేవలం కళ్యాణ్ రామ్ ని మాత్రమే అనుకున్నాను అని చాలా బలంగా చెబుతున్నాడు.

ఇక కళ్యాణ్ రామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కథను చాలా రకాలుగా మార్చేశాడు. ఏదేమైనా కళ్యాణ్ రామ్ తప్పితే ఆ పాత్రకు ఎవరు సెట్ కారు అనే విధంగానే అతను పాత్రను మలిచిన విధానం కూడా వర్క్ అవుట్ అయింది. ఇక నెక్స్ట్ ఈ దర్శకుడు మొదటి రిజెక్ట్ చేసిన హీరోలతో డినిమాలు చేస్తాడో లేదో చూడాలి.