Begin typing your search above and press return to search.
బింబిసార 2... మూడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్
By: Tupaki Desk | 31 May 2023 2:00 PMనందమూరి కళ్యాణ్ కెరీర్ లో వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న సమయంలో దక్కిన పెద్ద రిలీఫ్ 'బింబిసార'. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమా మంచి వసూళ్లు సొంతం చేసుకుని కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
బింబిసార సక్సెస్ అయిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించారు. అయితే దర్శకుడు వశిష్ఠ ఇతర కమిట్‌మెంట్స్ తో బిజీ గా ఉంటున్న కారణంగా ఆయన బింబిసార 2 కి దర్శకత్వం వహించడు అంటూ తేలిపోయింది. ఆ విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ నందమూరి కళ్యాణ్ రామ్ తెలియజేశాడు.. అంతే కాకుండా వశిష్ఠ కూడా సీక్వెల్ కి దర్శకత్వం వహించబోవడం లేదు అంటూ తేల్చి చెప్పాడు.
తాజాగా ఈ సీక్వెల్ గురించి మూడు ఆసక్తికర విషయాలు ప్రచారం జరుగుతోంది. మొదట విషయానికి వస్తే ఈ సినిమా కు వశిష్ఠ దర్శకత్వం వహించక పోవచ్చు కానీ స్క్రిప్ట్ వర్క్ లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నాడు. బింబిసార 2 సినిమా కి స్క్రిప్ట్ ను వశిష్ఠ అందించేందుకు ఒప్పుకున్నారట.
ఇక ఈ సినిమా యొక్క నిర్మాణ భాగస్వామిగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ బడ్జెట్ తో బింబిసార 2 ను నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇక మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే మొదలు పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. ఈ ఏడాది చివరి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయాలని భావిస్తున్నారట.