Begin typing your search above and press return to search.
బికినీ వివాదం: 100 కోట్ల పెట్టుబడి 1000 మంది బతుకులు చూడరా?
By: Tupaki Desk | 1 April 2023 9:30 PMపఠాన్ సంచలన విజయం సాధించి దాదాపు 1000 కోట్లు పైగా వసూలు చేసింది. ఓవరాల్ గా 1100 కోట్ల మేర ముగింపు కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వెల్లడించింది. అయితే పఠాన్ వసూళ్లను మించి ఈ సినిమాలోని బేషరంగ్ రంగ్.. పాటలో ఆరెంజ్ బికినీ గురించే ఎక్కువగా చర్చ సాగింది. సినిమా రిలీజై క్లోజింగ్ రన్ కి చేరుకున్న తర్వాత కూడా దీనిగురించే యువతరం ముచ్చటించుకుంటోందంటే దీపిక ఆరెంజ్ బికినీ ఎంతగా కల్లోలానికి కారణమైందో అర్థం చేసుకోవాలి.
నిజానికి అది ఆరెంజ్ బికినీ అయినా కాషాయ స్వాములు భగ్గుమనేలా చేసింది. మహారాష్ట్ర రాజకీయ సేనలు వివాదాలకు తెర తీసాయి. స్పైసీగా అలా కాషాయ బికినీలో కనిపిస్తావా? అంటూ దీపికపైనా పఠాన్ బృందంపైనా విరుచుకుపడ్డారు.
దీపిక టోన్డ్ బికినీ లుక్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ రంగు సాంస్కృతిక విధ్వంశంగా కనిపిస్తోందని మతాన్ని కించపరుస్తోందని నానా యాగీ చేసారు. రైట్ వింగ్ లు చాలా కలతకు గురయ్యారు. దాంతో సినిమాకు వ్యతిరేకంగా #బహిష్కరణ పిలుపులు సంచలనం అయ్యాయి. అయితే ఏనాడూ ఈ ఈ వివాదంపై చిత్ర హీరో షారుక్ ఖాన్.. హీరోయిన్ దీపికా పదుకొణె.. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అంతేకాదు.. మీడియా ముందుకు వచ్చి పఠాన్ కి ప్రచారం చేయాలనే ఆలోచనను కూడా విరమించుకున్నారు. ఒకవేళ అలా చేస్తే వివాదాస్పద ప్రశ్నల్ని ఎదుర్కోవడం మరింతగా అగ్నికి ఆజ్యం పోస్తుందని చిత్రబృందం తెలివైన ప్రణాళికలతో ముందుకు వెళ్లింది. ఏం తేడా మాట్లాడినా అది సినిమా బాక్సాఫీస్ అవకాశాలను దెబ్బతీస్తుందనే భయంతో వారు సినిమా ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు.
ఎట్టకేలకు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆరెంజ్ కలర్ బికినీ వివాదంపై ముచ్చటించారు. స్పెయిన్ లో చిత్రీకరించిన ఈ పాట కోసం నేపథ్యం పూర్తిగా ఆకుపచ్చ నీలంతో ఉంటుంది. అందువల్ల కాంట్రాస్ట్ గా ఉండేందుకు ఆరెంజ్ కలర్ ఎంచుకున్నాము.
ఒక సినిమా ఫలితం 100 కోట్ల పెట్టుబడితో పాటు 1000 మంది ఆధారపడిన వారి జీవితాలతో ముడిపడి ఉంటుందని బహిష్కరణ పిలుపునిచ్చిన ఈ వ్యక్తులు అర్థం చేసుకోలేరు '' అని సిద్ధార్థ్ అన్నారు. ఆరెంజ్ బికినీ వివాదంపై సూటిగా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. తెలివిగా సినిమా బాక్సాఫీస్ రన్ ముగిసాక తాము ఇవ్వాల్సిన సమాధానాన్ని ఇచ్చారు దర్శకుడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.