Begin typing your search above and press return to search.

బి బాక్సాఫీస్‌ వద్ద ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌

By:  Tupaki Desk   |   9 Jun 2023 8:00 PM GMT
బి బాక్సాఫీస్‌ వద్ద ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌
X
బాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో విడుదల అయిన అన్ని సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ఏమాత్రం ఆకట్టు కోని కథ మరియు కథనం తో సినిమా లు వస్తున్నాయి అంటూ ప్రేక్షకు లు వాటిని తిరస్కరిస్తున్నారు. బాగున్న సినిమాల కు బ్రహ్మరథం పడుతున్నారు. పఠాన్ సినిమా కు వెయ్యి కోట్లు కట్ట బెట్టిన బాలీవుడ్‌ ప్రేక్షకులు కొన్ని సినిమాల కు మినిమం వసూళ్లు ఇవ్వట్లేదు.

ఇలాంటి సమయం లో బాక్సాఫీస్‌ వద్ద రెండు సినిమాలు ఒకే సారి విడుదల అయ్యి పోటీ పడితే కచ్చితంగా రెండు సినిమాల కు కూడా నిరాశే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయిన కూడా ఆగస్టు లో బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్‌ పోటీ జరగబోతుంది.

అక్షయ్‌ కుమార్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ఓ మై గాడ్‌ సినిమా కు సీక్వెల్‌ గా రూపొందిన ఓమై గాడ్‌ 2 సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సెల్ఫీ సినిమా ఫ్లాప్‌ అవ్వడం తో ఆయన అభిమానులు ఓమై గాడ్‌ 2 సినిమా పై అంచనాలు పెట్టుకుని వెయిట్‌ చేస్తున్నారు.

ఇదే సమయంలో గద్దర్‌ 2 మరియు యానిమల్‌ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ కలిగి ఉన్నాయి. కనుక చ్చితంగా మూడు సినిమాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద పోటీ గట్టిగానే పడే అవకాశాలు ఉన్నాయి. మూడు సినిమాల పోటీ తే కచ్చితంగా మూడు సినిమాల కు నష్టం తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.