Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E10 : గుంట నక్క తేలిపోయింది.. ఆటలో లోబో ఆగంఆగం

By:  Tupaki Desk   |   15 Sep 2021 3:31 AM GMT
#BIGGBOSS5TELUGU E10 : గుంట నక్క తేలిపోయింది.. ఆటలో లోబో ఆగంఆగం
X
తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 మొన్న సోమవారం ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్‌ నామినేషన్ కోసం ఇంటి సభ్యులు అందరిని కలిపి రెండు గ్రూప్‌ లుగా విభజించడం జరిగింది. ఎలిమినేషన్‌ సమయంలో రచ్చ రచ్చ చేసిన ఇంటి సభ్యులు తాజా ఎపిసోడ్‌ లో అదే రెండు జట్లు పంథం నీదా నాదా అనే ఫిజికల్‌ గేమ్‌ ను ఆడారు. రెండు జట్లు కూడా హోరా హోరీగా ఫిజికల్‌ స్ట్రెంగ్త్‌ ను చూపిస్తూ ఆటను ఆడేందుకు ప్రయత్నించాయి. రెండు జట్లకు రెండు డగౌట్స్ లో ఉన్న పిల్లోలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎవరి డగౌట్స్ లో వారు పిల్లోస్ ను తీసుకోవడంతో పాటు ప్రత్యర్థి జట్టు పిల్లోస్ ను కూడా తీసుకోవచ్చు. ఈ విషయంలో ఆట చాలా రసవత్తరంగా సాగింది. అమ్మాయిలు టీ షర్ట్‌ లోపల అబ్బాయిలు పాయింట్ లోపల పిల్లోస్ దాచుకునే ప్రయత్నాలు చేశారు. అమ్మాయిలు టీ షర్ట్‌ లో దాస్తే ప్రత్యర్థి జట్టు అమ్మాయిలు ఆ పిల్లోస్ ను తీసేందుకు ప్రయత్నించారు. అబ్బాయిలు పాయింట్లో పెట్టుకుంటే అబ్బాయిలు దాన్ని తీసేందుకు ప్రయత్నించడం జరిగింది. ఆ క్రమంలో సిరి టీ షర్ట్‌ లో పిల్లో పెట్టుకున్న సమయంలో సన్నీ ఆమెను గట్టిగా పట్టుకుని ఉండగా శ్వేత వచ్చి తీసింది. అయితే సన్నీనే టీ షర్ట్‌ లో చేయి పెట్టాడు అంటూ సిరి వాదించింది. ఆ విషయం కెమెరాలకు సరిగ్గా తెలియలేదు. కాని సిరి వాదనతో సన్నీ ఏకీభవించలేదు. ఆమె పదే పదే అంటున్నా కూడా సన్నీ మాత్రం దాన్ని తోసి పుచ్చాడు. మొత్తానికి ఆట చాలా రసవత్తరంగా సాగింది. ఒకరిని ఒకరు లాగేయడం.. తోసేయడం.. దాదాపుగా కొట్టుకునే వరకు వెళ్లింది.

ఆట చాలా సీరియస్ గా సాగుతున్న సమయంలో లోబో కిందపడి పోయాడు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం అయ్యింది. వెంటనే ఆయన్ను డాక్టర్ రూమ్‌ కు పిలవాలంటూ ఇంటి సభ్యులు విజ్ఞప్తి చేశారు. దాంతో లోబోను డాక్టర్ రూమ్‌ కు పిలిపించారు. ఆ సమయంలో కూడా ఇంటి సభ్యుల మద్య ఆట గొడవ సాగింది. శ్రీరామ చంద్ర మెడిసిన్ తీసుకు వచ్చేందుకు వెళ్తుంటే ఆట కోసం అనుకుని ఆయన్ను అడ్డుకున్నారు. రవి అతడిని ఆపే ప్రయత్నం చేయడంతో విశ్న చాలా సీరియస్ అయ్యాడు. ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ విశ్వను చాలా సీరియస్ గా రవి కూడా వాదించాడు. ఇద్దరు కూడా అన్న దమ్ముల మాదిరిగా ఉంటారు అనుకుంటే వారిద్దరి మద్య కూడా గొడవ జరిగింది. ఆ తర్వాత రవి మెల్లగా ఎక్స్‌ ప్లెయిన్‌ చేసేందుకు ప్రయత్నించాడు. విశ్వ కూడా దాన్ని తీసుకున్నట్లుగా అనిపించింది. ఇక ప్రియాంక మరియు ఇతర సభ్యులు ఫిజికల్‌ అవ్వడంతో కొందరికి దెబ్బలు తగిలాయి. కొందరు తెలివితో ఆడితే కొందరు మాత్రం ఫిజికల్ గా ఆడారు. మొత్తానికి పంథం నీదా నాదా టాస్క్‌ మద్యలో ఉంది. దాన్ని పాజ్ చేసిన బిగ్‌ బాస్ మరో గేమ్‌ ను తర్వాత ఎపిసోడ్‌ లో నిర్వహించబోతున్నాడు. డాక్టర్ రూమ్‌ కు వెళ్లి వచ్చిన లోబో ఆరోగ్యంగానే కనిపించాడు.

ఇక నామినేషన్‌ సమయంలో నటరాజ్ మాస్టర్ ఒక గుంట నక్క మేక వేశం వేసుకుని వచ్చి నన్ను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుంది. ఏడుగురిని నాపైకి వదిలేందుకు ప్రయత్నిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దాంతో నామినేషన్ పక్రియ పూర్తి అయిన తర్వాత రవి ఆయన వద్దకు వెళ్లి అసలు మ్యాటర్ ఏంటీ అంటూ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. నేను అలా చేయలేదు అంటూ చెప్పేందుకు ప్రయత్నించాడు. కాని నటరాజ్ మాస్టర్‌ మాత్రం వినిపించుకోలేదు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ మరొకరితో మాట్లాడుతున్న సమయంలో ఎవరు గుంట నక్క అనే దానికి సమాధానం చెప్పాడు. వచ్చి మాట్లాడాడు కదా రవి అతడే గుంట నక్క అన్నట్లుగా మాస్టర్ వ్యాఖ్యలు చేశాడు. మాస్టర్ కు రవిపై అంత కోసం ఎందుకు అనేది మాత్రం ఎవరికి అర్థం అవ్వడం లేదు. ఆ తర్వాత రవి తాను ఇంకా మాస్టర్ తో బాగుండేందుకు ప్రయత్నిస్తున్నాను. కాని ఆయన మాత్రం అలా ఉండటం లేదు అంటూ సీరియస్ అయ్యాడు. గొడవలు.. కామెడీ.. టాస్క్‌ ఇలా సీరియస్ గా తాజా ఎపిసోడ్‌ సాగిపోయింది.