Begin typing your search above and press return to search.

బిబి4 : గత సీజన్‌ల విన్నర్‌లను కాపీ కొడుతున్న సీజన్‌ 4 కంటెస్టెంట్స్‌

By:  Tupaki Desk   |   21 Sep 2020 4:30 PM GMT
బిబి4 : గత సీజన్‌ల విన్నర్‌లను కాపీ కొడుతున్న సీజన్‌ 4 కంటెస్టెంట్స్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ ఇప్పటి వరకు మూడు సీజన్‌ లను పూర్తి చేసుకుంది. ఈ మూడు సీజన్‌ లలో మొదటి సీజన్‌ ను శివ బాలాజీ గెలుచుకోగా రెండవ సీజన్‌ లో కౌశల్‌ నెగ్గాడు. మూడవ సీజన్‌ లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ గెలుపొందాడు. ఈ మూడు సీజన్‌ ల విజేతల క్వాలిటీస్‌ ను ఇప్పుడు సీజన్‌ 4 లో ఉన్న కొందరు కంటెస్టెంట్స్‌ కాపీ కొడుతున్నారు అనిపిస్తుంది. సీజన్‌ 1 విన్నర్‌ శివ బాలాజీ ఎక్కువగా కోపంతో ఉండేవాడు. అందరితో కలిసి పోయినట్లుగానే అనిపించినా కూడా ఏదైనా టాస్క్‌ లేదా ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆయన ఆవేశంతో ఊగిపోయేవారు. అదే ఆయన్ను బిగ్‌ బాస్‌ విన్నర్‌ గా నిలిపింది అనేది కొందరి మాట. అందుకే ఇప్పుడు హౌస్‌ లో ఉన్న ఇద్దరు ముగ్గురు ఒక్కో సారి హైపర్‌ గా మారిపోతున్నారు. ఆ తర్వాత కూల్‌ గా ఉంటున్నారు.

ఇక రెండవ సీజన్‌ విన్నర్‌ కౌశల్‌ ను ఎక్కువ శాతం మంది ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గేమ్‌ ప్లాన్‌ పెద్దగా ఏమీ లేకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెబుతూ తాను గెలుపు కోసమే వచ్చానంటూ చెబుతూ ఉండేవాడు. గెలుపు కోసం తాను ఏం చేసేందుకు అయినా సిద్దంగా ఉంటాను అంటూ పలు సార్లు అన్నాడు. అలాగే ఆయనకు ఒకటి రెండు సందర్బాల్లో సింపతి వల్ల అనూహ్యంగా గుర్తింపు వచ్చింది. దాన్ని కూడా కొందరు కోరుకుంటున్నారు. అలా కౌశల్‌ ను పలువురు ఫాలో అవుతున్నారు.

ఇక మూడవ సీజన్‌ లో విజేతగా నిలిచిన రాహుల్‌ సిప్లిగంజ్‌ను కూడా పాలో అవుతున్నారు. ఆయన కలిపిన పులిహోరా తరహా ఫార్ములను ఇంట్లో ఇద్దరు ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయాన్ని ప్రేక్షకులు ఈజీగానే గమనించవచ్చు. మొత్తానికి విన్నింగ్‌ ఫార్ములాను పట్టుకుని వేలాడుతూ వారిని వారు చూపించడం మానేయడం కూడా ప్రమాదమే. కనుక కాపీలు కొట్టడం మానేసి ఎవరికి వారు ఎలా ఉండాలంటే అలా ఉండటం బెటర్‌ అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.