Begin typing your search above and press return to search.

బిబి4 : ఈ వారం డబ్బుల్‌ ఎలిమినేషన్‌

By:  Tupaki Desk   |   19 Sep 2020 7:30 AM GMT
బిబి4 : ఈ వారం డబ్బుల్‌ ఎలిమినేషన్‌
X
బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 నేడు రేపు రెండవ వీకెండ్‌ ఎపిసోడ్స్‌ ప్రసారం అవ్వబోతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఈ వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని టాక్‌ వినిపిస్తుంది. ఇంటి సభ్యులు ఎక్కువగా ఉండటంతో పాటు మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్న కారణంగా ఈ వారంలో ఇద్దరిని ఎలిమినేట్‌ చేయడం ఉత్తమంగా నిర్వాహకులు భావిస్తున్నారట. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం గంగవ్వ ఉండలేను అంటూ చెబుతున్న కారణంగా ఆమెను నేడు లేదా రేపటి ఎపిసోడ్‌ లో పంపించేస్తున్నట్లుగా ప్రకటించే అవకాశం ఉందట.

గంగవ్వ కాకుండా ఓటింగ్‌ లో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉంది. ఈ వారం ఎలిమినేషన్‌ లో ఉన్న వారిలో కళ్యాణి.. కుమార్‌ సాయి మరియు సోహెల్‌ లకు తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు. ఈ ముగ్గురిలో ఒక్కరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గంగవ్వ మనసు మార్చుకుని ఉండాలనుకుంటే ఈ ముగ్గురిలో ఇద్దరు ఎలిమినేట్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి గంగవ్వ నిర్ణయంపై ఈ వారం ఎలిమినేషన్‌ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

నేటి ఎపిసోడ్‌ లో సేవ్‌ అయ్యే వారిని బట్టి రేపటి ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్‌ అయ్యేది ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నాగార్జున వచ్చిన సమయంలో గంగవ్వతో మాట్లాడి ఆమె ఉండాలనుకుంటుందా వెళ్లాలనుకుంటుందా అనే తుది నిర్ణయాన్ని చెప్పమని నిర్ణయం తీసుకుంటారట. ఆమె ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితం ఏడు ఎనిమిది వారాలు ఈజీగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి షోను రక్తి కట్టించేందుకు మరో వైల్డ్‌ కార్డ్‌ కావాలి కనుక ఈ వారం మాత్రం ఇద్దరిని ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.