బోల్డ్ లుక్ లో సెగలు రేపుతున్న బిగ్ బాస్ హారిక

Thu Jan 26 2023 18:00:01 GMT+0530 (India Standard Time)

Bigg Boss Harika is rocking in bold look

దేత్తడి హారికగా యుట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అందాల భామ  అలేఖ్య హారిక. ఈ తెలంగాణ పిల్లకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యుట్యూబ్లో ఈమె చేసిన కంటెంట్ కి చాలా మంది ఫ్యాన్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడిలో మంచి డాన్సర్ కూడా ఉంది. సోషల్ మీడియా ఫేమ్ కారణంగా హారికకి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం కూడా లభించింది.



ఈ షో ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న హారిక టెలివిజన్ రియాలిటీ షోలలో కూడా పాల్గొని తన డాన్స్ యాక్టింగ్ స్కిల్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఇదే సమయంలో సినిమాలలో కూడా మంచి అవకాశాలనే దక్కించుకుంది.

లీడ్ రోల్స్ కాకుండా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేసింది. వరుడు కావలెను ఆదిత్యవర్మ శ్రీకారం సినిమాలలో హారిక నటించింది. ప్రస్తుతం యుట్యూబ్ లో వెబ్ సిరీస్ లు చేస్తుంది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది.

ఈ అమ్మడు నటనకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో గ్లామర్ కి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగమ్మాయి అయినా కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా మోడరన్ అవుట్ ఫిట్స్ లో హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. రెగ్యులర్ లో ఈమె తన బోల్డ్ లుక్ తో ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ట్రెడిషనల్ అండ్ బోల్డ్ లుక్ ఏదైనా కాని హారికకి కరెక్ట్ గా సెట్ అవుతుంది.

తాజాగా ఈ అమ్మడు జీన్ షార్ట్ బ్లాక్ టాప్ తో హాట్ అండ్ బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఈ లుక్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హారికలో ఇంత గ్లామర్ ఉందా అనుకునేలా ఆమె ఫోజులు ఇవ్వడం విశేషం.

హీరోయిన్ గా ఒక్క సినిమా పడితే హారిక రేంజ్ మారిపోవడం పక్కా అని ఈమె లుక్స్ చూసిన తర్వాత కుర్రాళ్ళు మాట్లాడుకోవడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.