ఫోటోటాక్ : బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ అందాల ఆరబోత

Tue Jun 28 2022 17:00:01 GMT+0530 (IST)

Bigg Boss Beauty Nandini Roy

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో సందడి చేసిన నందిని రాయ్ అందాల ఆరబోత తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. బిగ్ బాస్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా కూడా ఈ అమ్మడి జోరు మాత్రం తగ్గలేదు. బిగ్ బాస్ ముందు వరకు పెద్దగా గుర్తింపు లేని ఈ అమ్మడు బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ ల్లో నటించి నాలుగు ప్రాజెక్ట్ లు వెనకేసుకుంది.నటిగా బిజీగా ఉన్నా లేకున్నా కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోత తో బిజీగా ఉంటుంది. ఈమద్య కాలంలో ఇన్ స్టా గ్రామ్ ఆదాయం బాగుంటున్న కారణంగా చాలా మంది సెలబ్రెటీలు ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే ఈ అమ్మడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటూ తన అందాల ప్రదర్శణ చేస్తూ ఉంది.

అందంగా ఆకట్టుకునే విధంగా కనిపించే నందిని రాయ్ ఎంత స్కిన్ షో చేసినా కూడా అందంగానే కనిపిస్తుంది కాని ఎబ్బెట్టుగా ఉండదు అంటూ అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నా కూడా అందులో ఏ ఒక్క ఫోటో కూడా ఎబెట్టుగా ఉండటం లేదు.

నందిని రాయ్ ఇటీవలే గాలివాన అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాకుండా బుల్లి తెరపై పలు షో ల్లో కనిపించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు మరింతగా ఆకర్షణీయంగా కనిపిస్తూ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. తెలుగు లో ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటూ మరో భాషలో కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.