బిగ్ బాస్ 6 : సుత్తి దెబ్బ.. దుమ్ము దమ్ము ఉన్న కంటెస్టెంట్స్

Mon Sep 26 2022 11:31:32 GMT+0530 (India Standard Time)

Bigg Boss 6: Hammer blow.. Contestants

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్ ఎప్పటిలాగే సరదాగా.. కాస్త ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తానికి ఆదివారం ఎపిసోడ్ అలా అలా సాగింది. ముందుగా కంటెస్టెంట్స్ కి నాగార్జున ఒక సుత్తి ఇచ్చి తాను అడిగే ప్రశ్నలకు ఎవరు సూట్ అవుతారో వారి తల మీద సుత్తితో కొట్టాలని చెప్పాడు. ఆ సందర్భంగా పలువురు పలు రకాలుగా స్పందించారు.మొదట కెప్టెన్ ఆదిరెడ్డి ఈ టాస్క్ ను మొదలు పెట్టాడు. ఇంట్లో నోటి దూల ఎవరికి ఎక్కువ అంటూ నాగార్జున ప్రశ్నించిన సమయంలో గీతూ రాయల్ నెత్తిపై సుత్తిదెబ్బ వేసి ఆమె కు నోటి దూల కాస్త ఎక్కువ అన్నట్లుగా ఆదిరెడ్డి సమాధానం ఇచ్చాడు. ఆ సమయంలో గీతూ రాయల్ కి నోటి దూల కాస్త ఎక్కువే అన్నట్లుగా ఆడియన్స్ లో చాలా మంది చెప్పుకొచ్చారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న వారిలో యూజ్ లెస్ ఎవరు.. బ్రెయిన్ లెస్ ఎవరు.. గాడిద ఎవరు.. ఓవర్ యాక్షన్ ఎవరు ఇలా పలు ప్రశ్నలకు కంటెస్టెంట్స్ సుత్తి దెబ్బతో తమ అభిప్రాయం చెప్పారు.

ఇక నామినేషన్స్ లో ఉన్న వారిలో శ్రీహాన్ మరియు గీతూలు సేవ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇంకో టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా జంతువుల పేర్ల ఇచ్చి అందులో ఎవరు ఎవరికి సెట్ అవుతారు అంటూ కారణం చెబుతూ వారికి ఆ బోర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో కూడా రకరకాల కారణాలు చెబుతూ కంటెస్టెంట్స్ తమకు ఎవరిపై ఎలాంటి ఫీలింగ్ ఉందో బయట పెట్టేశారు. దీంతో గొడవలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా గీతూ రాయల్ ఊసరవెల్లి బోర్డు ను తీసుకు వెళ్లి నేహా చౌదరికి ఇచ్చింది. నేహా చౌదరి ఆ తర్వాత అదే ఊసరవెల్లి ట్యాగ్ ను గీతూ రాయల్ కి ఇచ్చింది. ఇద్దరి మధ్య కాస్త సీరియస్ వార్ జరిగిందనే చెప్పాలి. గాడిద ట్యాగ్ ను రేవంత్ కి చంటి ఇవ్వడం జరిగింది. ఇలా రకరకాల జంతువుల యొక్క పేర్లను కంటెస్టెంట్స్ ఇచ్చి కొందరు నెగటివ్ గా మాట్లాడితే కొందరు పాజిటివ్ గా చెప్పారు.

ఇక బిగ్ బాస్ మూడవ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే చివరి వరకు వాసంతి మరియు నేహా చౌదరి లు ఉన్నారు. వారి యొక్క ఫోటోలను త్రాసులో వేసినప్పుడు ఎవరి ఫోటో తక్కువ బరువు ఉంటే వారు ఎలిమినేట్ అయినట్లుగా నాగ్ చెప్పాడు. ముందుగా లీక్ అయినట్లుగా నేహా చౌదరి నిన్నటి ఎపిసోడ్ నుండి ఎలిమినేట్ అయ్యింది.

బయటకు వచ్చిన తర్వాత దుమ్ము అంటే వృధా కంటెస్టెంట్స్ గా ఇనాయా.. రేవంత్.. ఆరోహి.. అర్జున్.. వాసంతి.. గీతూ రాయల్ లను ఎంపిక చేసింది. ఆపై దమ్మున్న కంటెస్టెంట్స్ అంటే మంచి ఆట తీరు ప్రదర్శించే వారిగా రాజ్.. చంటి.. సుదీప.. ఆది రెడ్డి.. బాలాదిత్య.. శ్రీహాస్.. శ్రీ సత్య ల పేర్లు చెప్పింది. మొత్తానికి మూడవ వారం పూర్తి అయ్యి నాల్గవ వారంలో బిగ్ బాస్ సీజన్ 6 అడుగు పెట్టింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.