సల్మాన్ సినిమా తెలుగులో భారీ రిలీజ్ ప్లాన్..!

Sat Apr 01 2023 13:02:22 GMT+0530 (India Standard Time)

Big Release Plan of Salman Movie in Telugu

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సల్మాన్ ఖాన్ సడెన్ గా తెలుగు పరిశ్రమ మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన ఆయన లేటెస్ట్ గా తను చేస్తున్న కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాను తెలుగులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించడంతో బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు సల్మాన్ సినిమా మేకర్స్.కిసి కి భాయ్ కిసి కా జాన్ సినిమా తెలుగు ఆడియన్స్ కి చూపించాలని ఫిక్స్ అయ్యారు. సినిమాలో వెంకటేష్ చెల్లిగా పూజా హెగ్దే నటిస్తుంది. అంతేకాదు బతుకమ్మ సాంగ్ కూడా పెట్టారంటే సినిమాను తెలుగు ఆడియన్స్ కి ఎంతగా రీచ్ అవ్వాలని చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. డైరెక్ట్ వెంకటేష్ సినిమా రేంజ్ లో సల్మాన్ సినిమాను ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.

ఎలాగు తెలుగు వర్షన్ వస్తే మన ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు కాబట్టి కిసి కి భాయ్ కిసి కా జాన్ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ ఫిక్స్ చేశారట. తెలుగులో బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు తెలుస్తుంది. తెలుగు ఆడియన్స్ కు సమ్మర్ ట్రీట్ ఇచ్చేందుకు వెంకటేష్ తో కలిసి వస్తున్నారు సల్మాన్ ఖాన్. ఈ సినిమాలో సర్ ప్రైజ్ గా చరణ్ కూడా కనిపిస్తాడని అంటున్నారు. చరణ్ సినిమాలో కెమియో ఉంటుందని టాక్.

మొత్తానికి సల్మాన్ కూడా తెలుగు మార్కెత్ మీద కన్నేశాడు. ఈమధ్య తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న హడావిడి చూసి మన సినిమాలు అక్కడ ఆడినట్టే హిందీ సినిమాలను కూడా తెలుగు ఆడియన్స్ కి ఎక్కించాలని చూస్తున్నారు.

ఇప్పటికే రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర తెలుగులో కూడా మంచి ఫలితాన్ని దక్కించుకుంది. పఠాన్ కూడా పర్వాలేదు అనిపించుకుంది సో అందుకే సల్మాన్ ఖాన్ కూడా ఇక్కడ సత్తా చాటాలని చూస్తున్నాడు.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.