సెప్టెంబర్లో.. ఎన్ని పెద్ద సినిమాలో తెలుసా..

Fri Mar 24 2023 11:00:01 GMT+0530 (India Standard Time)

Big Movies in September Box Office

సెప్టెంబర్ బాక్సాఫీస్ బద్దలు కానుంది. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు బిగ్ మూవీస్ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూవీస్ లో ఏ ఒక్కటి హిట్ అయినా బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ లో ఏయే మూవీస్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయో ఓ లుక్కేద్దాం.విజయ్ దేవరకొండ సమంత క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఖుషీ. ఈ మూవీ టైటిలే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఖుషీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషనే చాలా క్రేజీగా అనిపిస్తోంది. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ... సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కాంబోలో వచ్చే మూవీ సినీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మూవీలో కాజల్ అగర్వాల్ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే.

నేచురల్ స్టార్ నాని దసరాతో సినీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మూవీ మార్చి 30వ తేదీన విడుదల కానుంది. మరోవైపు Nani30ని పట్టాలకెక్కించాడు. నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ సలార్. కేజీఎఫ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ మూవీకి డైరెక్షన్ చేస్తుండటంతో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో సలార్ ను విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ప్రకటించింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.