టాలీవుడ్ బడా ఫ్యామిలీలో చీలికలు వచ్చాయా...?

Fri Oct 16 2020 23:00:10 GMT+0530 (IST)

Are there any rifts in the Tollywood Bada family ...?

టాలీవుడ్ లోని ఓ పెద్ద ఫ్యామిలీలో చీలిక వచ్చిందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకే ఫ్యామిలీ హీరోలైనప్పటికీ వారి ఫ్యాన్స్ వర్గంలో మాత్రం మొదటి నుంచీ ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ముఖ్యంగా వారిలో ఒక హీరో ఇండస్ట్రీకి ఎవరి వల్ల వచ్చాడో మర్చిపోయాడని.. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత సొంత కష్టంతోనే పైకొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడనే టాక్ నడిచింది. ఈ క్రమంలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఇద్దరు ఫ్యామిలీ హీరోల మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఇన్నాళ్లు వారి కుటుంబంలో మనస్పర్థలు ఉన్నాయనే వార్తలు ఒట్టి పుకార్లని కొట్టేసిన వారు సైతం.. ఇటీవల జరిగిన ఓ ఇన్సిడెంట్ తో ఇది నిజమేనేమో అని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.ఇటీవల ఆ ఫ్యామిలీలో అంతర్భాగమైన మరో ఫ్యామిలీ ఓ స్టూడియో నిర్మాణానికి పునాది వేశారు. అయితే కార్యక్రమానికి పెద్ద ఫ్యామిలీ హీరోలెవ్వరూ హాజరుకాకపోవడంతో ఇటు అభిమానుల్లో అటు ఇండస్ట్రీ వర్గాల్లో చాలా సందేహాలు మొదలైయ్యాయి. వీటికి ఆజ్యం పోస్తూ సీనియర్ హీరో నటించే సినిమా బిజినెస్ విషయంలో స్టూడియో నిర్మాణం చేపట్టిన టీమ్ మెంబెర్స్ ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని ఆర్డర్స్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వారికి ధీటుగా ఓ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో పాటు ఓ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ కూడా పెట్టడానికి సీనియర్ హీరో తనయుడు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

అలానే ప్రముఖ స్టూడియో వారు తలపెట్టబోయో ఓ కొత్త వెంచర్ లో పార్టనర్ షిప్ తీసుకోవాలనే ప్రపోజల్ కూడా ఆ హీరోకి వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా మిగతా ఫ్యామిలీ హీరోల భాగస్వామ్యం లేకుండా స్టూడియో నిర్మాణం మొదలుపెట్టినప్పుడే వారితో తమకు సంబంధం లేదని.. వేరు కుంపటి పెడుతున్నట్లుగా ఇండైరెక్ట్ గా ప్రకటించేశారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే వీరందరూ ఏదైనా సందర్భంలో ఆత్మీయంగా కలిసిపోయి ఈ వార్తలకు చెక్ పెడతారేమో చూడాలి.