Begin typing your search above and press return to search.

స్విమ్ సూట్ అందాలతో ఖుషీ బ్యూటీ గ్లామర్ షో!

By:  Tupaki Desk   |   17 May 2021 10:33 AM GMT
స్విమ్ సూట్ అందాలతో ఖుషీ బ్యూటీ గ్లామర్ షో!
X
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ భూమిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ 2000లో 'యువకుడు' అనే సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. అనంతరం ముంబైకి మకాం మార్చి సినిమాల్లో చేరింది. అమ్మడు దాదాపు అన్ని ఇండస్ట్రీలలో హీరోయిన్ గా మూవీస్ చేసింది. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, భోజ్ పురి, పంజాబీ, మలయాళ భాషలలో అనేక చిత్రాలలో నటించింది. భూమిక కెరీర్లో ఖుషి, తేరే నామ్, మిస్సమ్మ, గాంధీ, మై ఫాదర్ - సత్యభామ సినిమాలు ఎక్కువగా గుర్తింపు తీసుకొచ్చాయి. 2003లో విడుదలైన 'మిస్సమ్మ' సినిమాకు ఉత్తమనటిగా నంది పురస్కారం అందుకుంది.

ఢిల్లీలో పుట్టి పెరిగిన భూమిక తన విద్యను కూడా అక్కడే పూర్తిచేసింది. చదువు పూర్తవగానే మోడలింగ్ లో అడుగుపెట్టింది. అలా పాండ్స్ పౌడర్ ప్రకటనలో మెరిసిన భూమిక తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ అయింది. 2003లో సల్మాన్ ఖాన్ సరసన 'తేరేనామ్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది అమ్మడు. అయితే కెరీర్ పరంగా భూమిక.. టాలీవుడ్ స్టార్స్ అందరితో సినిమాలు చేసింది. మెగాస్టార్ నుండి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్.. ఇలా అందరితో భారీ హిట్స్ అందుకుంది.

అనంతరం 2007లో స్నేహితుడు భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ మద్యే 'ఎంసిఏ' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అలాగే ఇటీవలే అమ్మడు ఇండస్ట్రీలో 20ఏళ్లు కెరీర్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా.. భూమిక ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే గ్లామర్ పోస్టులు పెడుతోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ చేస్తున్న పోస్ట్ పెట్టింది. మరి కుర్రకారు ఊరుకుంటారా.. నలభై రెండేళ్ల వయసులో కూడా అదే నాజూకుదనంతో మెరిసిపోతుంది. అందుకే అలా చూస్తూ ఉండలేక భూమిక గ్లామర్ షోను ఆస్వాదిస్తూ లైక్స్ షేర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ స్విమ్ సూట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.