టీజర్ టాక్: 16 హత్యల మిస్టరీ తేలెదెలా డిటెక్టివ్?

Sun Jan 29 2023 10:01:46 GMT+0530 (India Standard Time)

Bhoothaddam Bhaskar Narayana Teaser

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు నిరంతరం ఆదరణ ఉంటుంది. కథలో కొత్తదనం కథనంలో బిగి వర్కవుటైతే .. సినిమా ఆద్యంతం కుర్చీ అంచుమీద కూచుని చూసేంత గ్రిప్పింగ్ గా నేరేట్ చేస్తే ఈ జానర్ సినిమాలు విజయం సాధించేందుకు ఆస్కారం ఉంది. అందునా క్రైమ్ కథలు మర్డర్ మిస్టరీలు ఎప్పుడూ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. గూఢచారి స్పై థ్రిల్లర్లకు భిన్నమైన స్టైల్లో ఈ జానర్ సినిమాలు అలరిస్తుంటాయని ఇంతకుముందు కమల్ హాసన్ నటించిన రాఘవన్.. బెల్లంకొండ నటించిన రాక్షసుడు..నవీన్ పోలిశెట్టి- ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాలు నిరూపించాయి. 



ఇప్పుడు నవతరం ప్రతిభావంతుడు శివ కందుకూరి అదే తరహా ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాత రాజ్ కందుకూరి వారసుడు శివ కందుకూరి నటిస్తున్న తాజా చిత్రం `భూతద్దం భాస్కర్ నారాయణ`. తాజాగా టీజర్ ను ఆవిష్కరించారు. టీజర్ ఆద్యంతం రక్తి కట్టించే ఎలిమెంట్స్ తో ఉత్కంఠ పెంచే రీరికార్డింగ్ తో ఆసక్తిని పెంచింది.

16 వరుస హత్యలు .. తల లేని మొండెంపై శోధన.. దీనికోసం పోలీసులు ఒక వైపు.. డిటెక్టివ్ ఇంకో వైపు తమదైన శైలిలో ప్రయత్నాలతో ఉత్కంఠను పెంచింది ఈ టీజర్. ప్రైవేట్ డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ తన దర్యాప్తులో అసలు నిజాల్ని నిగ్గు తేల్చాడా లేదా? అన్నది తెరపైనే చూడాలి. టైటిల్ పాత్రధారి ఆహార్యం ఆకట్టుకుంది. టైటిల్ పాత్రకు తగ్గట్టే శివ తన బాడీ లాంగ్వేజ్ ని ఆవిష్కరించిన తీరు సూటైంది.

అయితే టీజర్ ఆద్యంతం జవాబు లేని ప్రశ్నలతో ముగించారు. బహుశా క్లూ లెస్ గా సాగే వరుస హత్యలకు ఎక్కడైనా చిన్న క్లూ దొరికినా డిటెక్టివ్ కనిపెట్టేస్తాడు. ఈ హత్యలన్నిటికీ కామన్ పాయింట్ ఒక దిష్ఠి బొమ్మను హతుల మృత దేహాలపై విడిచి వెళుతుంటాడు సైకో. అయితే ఈ సైకో హత్యల వెనుక ఏమైనా మూఢ నమ్మకాలు ఉన్నాయా? దీన్ని భూతద్ధం భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించారు? అన్నది తెరపైనే చూడాలి.  నాటి కాలంలో పాతుకుపోయిన చీటిక.. చెడుపు వంటి నమ్మకాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఈ కథలో టచ్ చేసారని అర్థమవుతోంది.
తాజాగా విడుదలైన టీజర్ కి శ్రీ చరణ్ పాకాల బీజీఎం సంగీతం ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ పనితనంతో విజువల్ రిచ్ టీజర్ ఇది.

ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారదమునితో పాటు ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భువిపై అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడమని ఆ విష్ణుమూర్తిని వేడుకొనే సన్నివేశాన్ని బట్టి దీనికి పురాణేతిహాసం టచ్ కూడా ఇచ్చారని అర్థమవుతోంది. సాక్షాత్తు ఆ నారాయణుడు చింతించకు ఇంద్రదేవా..! కలియుగంబున భువిపైన జనియించి.. ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నానని చెప్పడంతో హీరో భూతద్ధం భాస్కర్ నారాయణ ఎంట్రీ ఆకట్టుకుంది. డిటెక్టివ్ గా అతడి లుక్ యూనిక్ గా కనిపిస్తోంది. భూతద్ధం భాస్కర్ నారాయణ మార్చి 31న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. శివ కందుకూరి - రాశి సింగ్ నటించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. ఆయనే రచయిత.

మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్- సరగా ప్రొడక్షన్స్ పతాకాలపై స్నేహల్ జంగల్- శశిధర్ కాశి-కార్తీక్ ముడుంబి నిర్మించారు. అరుణ్- దేవి ప్రసాద్- వర్షిణి- శివ కుమార్- షఫీ- శివనారాయణ- కల్పలత- రూప లక్ష్మి- అంబటి శ్రీను తదితరులు ఈ చిత్రంలో నటించారు.