Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: భూమి నెవ్వ‌ర్ బిఫోర్ స్పైసీ లుక్

By:  Tupaki Desk   |   25 May 2020 5:30 AM GMT
ఫోటో టాక్‌: భూమి నెవ్వ‌ర్ బిఫోర్ స్పైసీ లుక్
X
భూమి పెడ్నేక‌ర్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. బాలీవుడ్ లో ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించిన ఈ అమ్మ‌డికి యువ‌త‌రంలో అద్భుత ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌లే `సాంద్ కి ఆంఖ్` చిత్రంలో షార్ప్ షూట‌ర్ గా ప్రామిస్సింగ్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఆ సినిమాలో భూమి ఓల్డ్ గెట‌ప్ పెర్ఫామెన్స్ పై ప్ర‌శంస‌లు కురిసాయి. 2019 హిట్ మూవీ ప‌తి ప‌త్ని ఔర్ వో చిత్రంలో వేడెక్కించే పాత్ర‌తో భూమి పాపులారిటీ మ‌రింత పెరిగింది.

ఇక‌పోతే భూమి ప‌లు మ్యాగ‌జైన్ ఫోటోషూట్ల‌తో యువ‌త‌రంలో భారీ ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. ప‌లు అవార్డ్ వేడుక‌ల్లో.. రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచి ఫ్యాష‌నిస్టాగాను పాపుల‌రైంది. భూమి డిజైన‌ర్ లుక్ .. అభిరుచిపై యువ‌త‌రం నిరంత‌రం డిబేట్లు పెడుతుంది.

తాజాగా వాట‌న్నిటినీ కొట్టేలా నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే హాట్ లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. కైపెక్కించే అందాల ఎర వేసింది ఈ భామ‌. బ్లాక్ ఇన్ వోర్ లో టూమ‌చ్ అనిపించేంత‌గా వేడెక్కించింది. ఇక ఈ అమ్మ‌డి సోష‌ల్ మీడియా ఫోటోషూట్లు ఎప్ప‌టిక‌ప్పుడు వైర‌ల్ గా మారుతున్నాయి. భూమి 2020లో నాలుగు సినిమాల్లో న‌టించింది. ఈ ఏడాది ఆరంభ‌మే `శుభ్ మంగ‌ల్ జాదా సావ‌ధాన్` లో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇచ్చింది. భూత్ -1 ది హాంటెడ్ షిప్.. డాలీ కిట్టీ ఔర్ వో .. దుర్గావ‌తి వంటి చిత్రాల్లో న‌టించింది. లాక్ డౌన్ వ‌ల్ల ఈ సినిమాల రిలీజ్ ఆల‌స్య‌మైంది. త్వ‌ర‌లో ఇవ‌న్నీ రిలీజ్ కావాల్సి ఉంది.