Begin typing your search above and press return to search.

వర్మ దారిలో మరో నిర్మాత.. ATT ద్వారా 90 సినిమాలు @ రూ.59

By:  Tupaki Desk   |   6 July 2020 6:45 AM GMT
వర్మ దారిలో మరో నిర్మాత.. ATT ద్వారా 90 సినిమాలు @ రూ.59
X
సినిమా రంగానికి కొత్త మార్గాన్ని రామ్ గోపాల్ వర్మ చూపుతూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీని పరిచయం చేసే వర్మ ఇటీవల ఓటిటి కి పోటీగా ఏటిటి ని పరిచయం చేశాడు. ఓటిటి ద్వారా ఒక్క సారి డబ్బు చెల్లిస్తే అందులో ఉన్న సినిమాలు అన్ని కూడా చూడవచ్చు. కాన్ని ఏటిటి ద్వారా మాత్రం థియేటర్ మాదిరిగా ఏ సినిమాకు అయితే డబ్బు చెల్లించామో ఆ సినిమానే చూడాల్సి ఉంటుంది. ఆ సినిమా కాకుండా మరోటి చూడాలి అంటే మళ్ళీ డబ్బు చెల్లించాలి.

ఇది సినిమా పరిశ్రమ వారిని ఆకర్షిస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తే భారీ గా టికెట్ రేటు పెట్టి సినిమా స్ట్రీమింగ్ చేయవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగదాయక మైనదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వర్మ ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేశాడు. ఆయన దారి లో ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ కూడా ఏటిటి ని మొదలు పెట్ట బోతున్నాడట.

తన భీమవరం టాకీస్ పేరుతోనే ఏటిటి మొదలు కాబోతుంది అంటూ ప్రకటన వచ్చింది. ఈ థియేటర్ లో ఒక్కో సినిమా చూడాలి అంటే కేవలం 59 రూపాయలు చెల్లిస్తే చాలు. ఏటిటి ద్వారా మొదటగా అమ్మడు కుమ్ముడు సినిమాను విడుదల చేయబోతున్నట్లు గా ఆయన ప్రకటించాడు. ఆతర్వాత కూడా వరుసగా సినిమాలు విడుదల చేస్తాను అంటూ పేర్కొన్నాడు. మొత్తం 90 సినిమాల కు పైగా ఏటిటి ద్వారా విడుదల చేస్తాను అని కేవలం 59 రూపాయలతో కుటుంబం మొత్తం కూడా సినిమా చూడవచ్చు అన్నాడు. వారానికి రెండు సినిమాలు విడుదల అవ్వనున్నాయట. ఇది ఇంకెంత మందికి ఆదర్శంగా నిలుస్తుందో చూడాలి.