Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ రష్మికని వదలడా..?

By:  Tupaki Desk   |   21 March 2023 8:00 AM GMT
ఆ డైరెక్టర్ రష్మికని వదలడా..?
X
పుష్ప తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతారామం సినిమాల్లో నటించిన రష్మిక బాలీవుడ్ లో వరుస ఛాన్స్ లు రావడంతో అక్కడకు షిఫ్ట్ అయ్యింది. అయితే హిందీలో అవకాశాలు వచ్చినా ఆ సినిమాల ఫలితాలు ఏవి రష్మికని పుష్ చేయలేకపోయాయి. సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చాలా తక్కువమంది భామలు బాలీవుడ్ లో రాణించగలిగారు. ఎంతోమంది సౌత్ స్టార్ హీరోయిన్స్ అక్కడ ఫెయిల్ అయ్యారు. వారి దారిలోనే రష్మిక కూడా ఉంటుందా అన్న డౌట్ రాక మానదు. వరుస హిందీ సినిమాలు చేస్తూ తెలుగు సినిమాలను లైట్ తీసుకుంది రష్మిక.

సీతారామం తర్వాత ఆమెతో చర్చలు జరిపిన వారు కూడా లేరని తెలుస్తోంది. బాలీవుడ్ లో మాత్రం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటిస్తుంది రష్మిక. లేటెస్ట్ గా ఒక తెలుగు సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. అదికూడా ఆ డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్ రష్మిక అవడం వల్ల ఆమె నో చెప్పలేకపోయింది. కన్నడలో కిరాక్ పార్టీతో పాపులర్ అయిన రష్మికని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ అట్లూరి. ఆ సినిమా సూపర్ హిట్ కాగా రష్మిక స్టార్ హీరోయిన్ గా తన ఫాం కొనసాగిస్తుంది.

వెంకీ డైరెక్ట్ చేసిన భీష్మ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. నితిన్, రష్మిక జోడీ భీష్మలో బాగా హైలెట్ అయ్యింది. ఇక ఇప్పుడు భీష్మ కాంబో అంటే నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమా వస్తుంది. ఈ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. తెలుగులో తొలి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అడిగితే రష్మిక కాదని అంటుందా చెప్పండి వెంటనే నితిన్ సినిమాకు ఓకే చెప్పేసిందట.

ప్రస్తుతం పుష్ప 2లో ఆమె భాగం అవుతున్నా ఆ సినిమాలో తన పాత్ర కొద్దిగానే ఉంటుందని తెలుస్తుంది. ఒకటి రెండు ప్రాజెక్ట్ లు చర్చల దశలోనే ఆగిపోయాయి. టాలీవుడ్ లో మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న రష్మికకు సరైన కాంబో సెట్ అయ్యింది. హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు హీరోయిన్ కూడా కాంబినేషన్ కుదరడంతో ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడేలా ఉంది. తను చేసిన రెండు సినిమాలకు రష్మికనే హీరోయిన్ గా పెట్టుకున్న వెంకీ కుడుముల 3వ సినిమాకు ఆమెనే దించుతున్నాడు. మరి ఈ డైరెక్టర్ రష్మికని వదిలిపెట్టేలా లేడని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.