సైలెంట్ అయిపోయిన 'భీమ్లా నాయక్'..?

Wed Dec 08 2021 16:08:26 GMT+0530 (IST)

Bheemla nayak film is not creating a buzz

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని 2022 జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.'భీమ్లా నాయక్' ను ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే సినిమా షూటింగ్ కంప్లీట్ అవకుండానే ఇప్పటికే నాలుగు పాటలను రిలీజ్ చేశారు. ఇంకొక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే మేకర్స్ ఎంత గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నా సినిమాపై బజ్ క్రియేట్ అవడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఇద్దరు హీరోలకు సంబంధించిన ఇంట్రో వీడియోలు - 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ - 'లాలా భీమ్లా' - 'అంత ఇష్టం' - 'అడవి తల్లి మాట' పాటలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో టైటిల్ సాంగ్ తప్పితే మిగతా వాటికి ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదని అంటున్నారు.

వచ్చే వారంలో హీరో రానా పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా ‘భీమ్లానాయక్’ నుంచి స్పెషల్ టీజర్ ని లేదా ఐదో సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. మసినిమా విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పోటీగా రెండు పాన్ ఇండియా సినిమాలు బరిలో ఉన్నాయి. వీటికి ధీటుగా నిలబడేలా రాబోయే రోజుల్లో పవన్ మూవీ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ని వదులుతారో చూడాలి.

కాగా మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి రీమేక్ గా ''భీమ్లా నాయక్'' రెడీ అవుతోంది. ఓ పోలీసు అధికారి - మాజీ సైనికాధికారి మధ్య అహం ఆత్మాభిమానం వల్ల జరిగిన ఘర్షణకు ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్ర ఖని - బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. 'భీమ్లా నాయక్' తో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.