గొడ్డలి పట్టిన పవన్.. లుంగీ ఎత్తిన రానా.. మరోసారి ఫుల్ క్లారిటీ

Sun Jan 16 2022 10:14:18 GMT+0530 (IST)

Bheemla Nayak Official Release Date Confirmed

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఆర్ఆర్ఆర్ అబ్లిగేషన్ లేకుంటే.. ఈపాటికి ఈ సినిమాను చూసేసి ఉండేవారు. సంక్రాంతి పండుగ డబుల్ థమాకాగా మారి ఉండేది. కానీ.. ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటం.. ఫిబ్రవరి 25కు షిఫ్టు కావటం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులు భారీ నిరాశకు గురయ్యారు. ఎవరికోసం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారో.. చివరకు ఆ సినిమా విడుదల కాస్తా వాయిదా పడటంపై పవన్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.మీరు రాకపోగా.. మమ్మల్ని చెడగొట్టారే అంటూ రాజమౌళి టీం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక.. ఈ మూవీని మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ను భీమ్లానాయక్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న  ఈ మూవీకి సంబంధించిన ఏ చిన్నపాటి అప్డేట్ వచ్చినా.. ఆన్ లైన్ హోరెత్తిపోతోంది.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. అంతే పవర్ ఫుల్ క్యారెక్టర్ తో రానా నటిస్తున్న ఈ సినిమా మొత్తం ఇద్దరు వ్యక్తుల ‘ఇగో’ మధ్య పోరుగా సాగుతుంది. సంక్రాంతి పండుగ వేళ.. ఈ సినిమాకు సంబంధించి ఫ్రెష్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో పవన్.. రానాలు ఇద్దరు ఉండటం విశేషం. వీరిద్దరు ఎవరికి వారు.. వారి స్టైల్లో సీరియస్ గా ఉండేలా డిజైన్ చేశారు. ఆగ్రహంతో ఉన్న పవన్ చేతిలోగొడ్డలి ఉంటే.. సీరియస్ గా ఉన్న రానా సిగిరెట్ తాగుతూ.. రెండు చేతులతో లుంగీని ఎత్తే ఫోజ్ ఉన్న ఫోటోలతో పోస్టర్ ను డిజైన్ చేశారు.

కరోనా మూడో వేవ్ నేపథ్యంలో.. ఈ సినిమా విడుదలపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో.. అలాంటిదేమీ ఉండదని.. ముందే చెప్పినట్లుగా ఫిబ్రవరి 25 థియేటర్లకురావటం ఖాయమన్న విషయాన్ని.. తాజా పోస్టర్ కన్ఫర్మ్ చేసింది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తాజా పోస్టర్..మరింత ఉత్సాహాన్ని పెంచేలా ఉందని చెప్పక తప్పదు.