'మెగా vs అల్లు' వివాదం: మెగా ఫ్యాన్స్ పై రామ్ చరణ్ సీరియస్..!

Wed May 25 2022 21:16:23 GMT+0530 (India Standard Time)

Bhavani Ravikumar Apologizes Allu Arjun Fans

ఇటీవల మెగా ఫ్యాన్స్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో బన్నీని ఉద్దేశిస్తూ అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడు భవాని రవికుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి.ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో మెగా అభిమానులు భేటీ అయ్యారు. అందులో పవన్ కల్యాణ్ భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ లో చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - నాగబాబు పక్కన అల్లు అర్జున్ కు స్థానం కల్పించలేదు.

అంతేకాదు చెప్పను బ్రదర్.. మాట్లాడను బ్రదర్ అంటూ బన్నీ పేరు ప్రస్తావించకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు భవానీ రవి కుమార్. చెప్పను బ్రదర్ ని మెగా ఫ్యాన్స్ ఎందుకు మోయాలంటూ.. నది దాటినాక తెప్ప తగలేసే వాళ్ళు తమకు వద్దని అన్నారు. అతను అనుభవిస్తున్న జీవితం కేవలం మెగాస్టార్ వల్లనే అని పేర్కొన్నాడు.

ఎంతో మంది వచ్చారు.. ఎంతో మంది పోయారు.. అహంకారం వద్దు బ్రదర్ అంటూ హెద్దేవా చేశారు. పరోక్షంగా 'పుష్ప 2' చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఇదే అతనికి లాస్ట్ సినిమా బ్రదర్ అని.. మెగా అభిమానులతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ కామెంట్స్ పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

'ఏం పీకలేరు బ్రదర్' అంటూ వారికి కౌంటర్ ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేశారు అల్లు అర్జున్ అభిమానులు. 'పుష్ప' తో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడంతో కొంతమంది మెగా అభిమానులు అభద్రతాభావంతో కావాలనే నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారని కామెంట్స్ చేశారు.

అయితే ఈ వివాదం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకూ వెళ్ళింది. దీనికి కారణమైన భవానీ రవి కుమార్ వ్యక్తి మీద చరణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణ చెబుతూ భవానీ ఓ వీడియోని విడుదల చేశారు.

ఇటీవల జరిగిన మీటింగ్ లో చెప్పను బ్రదర్ అంటూ మాట్లాడం తన తప్పే అని.. అలా మాట్లాడి ఉండకూడదని అన్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ అన్నయ్య కూడా తన మీద కోపంగా ఉన్నట్లు తెలిసిందని భవానీ తెలిపాడు.

గతంలో ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడటాన్ని తప్పుగా భావిస్తూ.. రామ్ చరణ్ ను బాధ పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నాడు. అలానే అల్లు అర్జున్ మరియు ఆయన అభిమానులకు సారీ చెప్తున్నానని అన్నాడు. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని భవానీ రవి కుమార్ చెప్పుకొచ్చారు.