విజయ్ న్యూడ్ ఫోటో గురించి హీరోయిన్ తల్లిని అడిగిన కరణ్..!

Sun Sep 25 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Bhavana comments on vijay devarakonda photos

బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న “కాఫీ విత్ కరణ్” సీజన్-7 సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. వ్యూయర్ షిప్ మాత్రం తగ్గడం లేదు.ఇందులో కరణ్ ఎప్పటిలాగే తన టాక్ షోకి వచ్చిన సెలబ్రిటీ గెస్టుల వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా సెక్స్ లైఫ్ మరియు ఎఫైర్స్ గురించిన అంశాలపైనే ఎక్కువగా చర్చిస్తూ వస్తున్నారు.

ఇటీవలే ప్రసారం కాబడిన KWK 12వ ఎపిసోడ్ కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ - సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ మరియు చుంకీ పాండే భార్య హీరోయిన్ అనన్య పాండే తల్లి భావన గెస్టులుగా హాజరయ్యారు.

ఇప్పటి వరకూ యంగ్ హీరోహీరోయిన్లతో అన్ని విషయాలపై ముచ్చట్లు పెట్టిన కరణ్ జోహార్.. ఈసారి సీనియర్ లేడీస్ తో కాస్త హుందాగా ప్రశ్నలు వేస్తారని అందరూ అనుకున్నారు. కానీ కరణ్ మాత్రం తనదైన శైలిలోనే చిట్ చాట్ నిర్వహించారు.

రాపిడ్ ఫైర్ రౌండ్ లో డేటింగ్ విషయంలో మీ కుమార్తె సుహానా ఖాను మీరిచ్చే సలహా ఏమిటి? అని గౌరీ ఖాన్ ను కరణ్ ప్రశ్నించాడు. గౌరీ స్పందిస్తూ.. "ఎప్పుడు కూడా ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేట్ చేయొద్దని చెబుతాను" అని చెప్పింది.

ఇది మంచి సలహా అని పేర్కొన్న కరణ్.. భావన వైపు చూస్తూ “అనన్య ఇప్పటికే అలా చేసిందని నేను అనుకుంటున్నాను” అని అన్నాడు. తన కూతురు ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేసిందని చెప్పడంతో షాక్ తిన్న భావన.. 'అవునా?' అని ఆశ్చర్యకరంగా అడిగింది.

“అవును. ఆమె ఇద్దరి మధ్యలో ఊగిసలాడుతున్నట్లు నేను భావిస్తున్నాను” అని కరణ్ అన్నాడు. “లేదు.. ఆమె ఇద్దరి గురించి ఆలోచించింది కాబట్టి.. ఒకరితో విడిపోయింది” అని భావన చెప్పడంతో అక్కడ మిగతా వారు కూడా నవ్వేశారు.

ఇకపోతే 'లైగర్' సినిమాతో టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ను బాలీవుడ్ లో లాంచ్ చేసిన కరణ్.. ప్రతీ ఎపిసోడ్ లోనూ మన రౌడీ పేరుని తీసుకొస్తూ వచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ అదే చేశాడు. ముగ్గురు లేడీస్ కి ‘ఫ్రీ పాస్’ లభిస్తే వారు కోరుకునే సెలబ్రిటీ ఎవరని అడిగాడు.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్లడానికి భావనా పాండే ఇష్టపడుతుందా? అని కరణ్ జోహార్ అడిగాడు. అయితే సీనియర్ లేడీస్ ముగ్గురూ దానికి ఏమీ సమాధానం ఇవ్వలేదు. గౌరీ ఖాన్ మాత్రం విజయ్ గురించి తెలియనట్లు ఎక్స్ ప్రెషన్ పెట్టింది.

ఇదే క్రమంలో వీడీ 'లైగర్' పోస్టర్ ను తీసుకువచ్చాడు కరణ్. అందులో రౌడీ బాయ్ ఇంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా.. కేవలం ఓ గులాబీ గుచ్చాన్ని తన ప్రైవేట్ పార్ట్స్ కి అడ్డుగా పెట్టుకొని నిలబడి ఉన్నాడు. అయితే కరణ్ ఆ గులాబీలన్నింటినీ తీసేయడం గురించి భావన ను అడగ్గా.. అనన్యకి చిన్నపాటి గుండెపోటు వస్తుందని ఆమె సమాధానం చెప్పింది.

అయితే ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడుతున్నాడు. 'లైగర్' సినిమాలో విజయ్ - అనన్య పాండే జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కుమార్తె కోస్టార్ తో డేటింగ్ అంటూ భావన ని ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎలా అడుగుతాడు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

దర్శక నిర్మాత మొదటి నుంచీ అలాంటివే అడుగుతున్నాడు కాబట్టి.. అందులో కొత్తేమీ లేదని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి రాబోయే సీజన్ లో కరణ్ జోహార్ ఎలాంటి సంచలనాలు రేపుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.