జూ.ఎన్టీఆర్ లెగసీని నడిపించే చిచ్చరపిడుగు..!

Mon Jun 14 2021 11:24:50 GMT+0530 (IST)

Bhargavaram running the JNTR legacy

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ పారిశ్రామికవేత్త.. స్థిరాస్తి వ్యాపారి నార్నేశ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని 2011లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట వారసులు అభయ్ రామ్ .. భార్గవ్ రామ్ వడివడిగా ఎదిగేస్తున్నారు. ఇద్దరు కుమారుల రాక.. సెంటిమెంటుగా కూడా తారక్ కి కెరీర్ పరంగా గొప్ప వైభవం దక్కింది. బిడ్డొచ్చేవేళ కలిసొచ్చే వేళ అని ప్రూవైంది. తారక్ అజేయుడైన సూపర్ స్టార్ గా పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకుంటున్నారు.నేడు చిన్నవాడైన భార్గవరామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా లిటిల్ టైగర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తారక్ ఫ్యాన్స్.. భార్గవ్ రామ్ 2018 జూన్ 14న జన్మించాడు. తనయుడితో తన అనుబంధానికి సంబంధించిన ఫోటోల్ని నేడు తారక్ షేర్ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఫోటోల్ని యంగ్ టైగర్ అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు. యంగ్ టైగర్ లెగసీని నడిపించే వారసుడెవరు? అన్న చర్చా తాజాగా అభిమానుల్లో మొదలైంది. మొదటి వాడు అభయ్ రామ్ కాస్త నెమ్మది కానీ భార్గవ్ రామ్ మాత్రం చాలా స్పీడ్ అని చెబుతుంటారు. పెద్దోడ్ కామ్ గోయింగ్ .. చిన్నోడు తారక్ లానే జోవియల్ అని ఇంతకుముందు హింట్ అందింది. మరి ఆ ఇద్దరిలో ఎవరు లెగసీని ముందుకు నడిపిస్తారో కాలమే నిర్ణయించాలి.

ఎన్టీఆర్ నటిస్తున్న 29వ సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ మూవీ రిలీజ్ కి ముందే కొరటాలతో ఎన్టీఆర్30.. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్31 ఖరారయ్యాయి. ఎన్టీఆర్ 32 త్రివిక్రమ్ తో ఉండే ఛాన్సుంది. ఎవరు మీలో కోటీశ్వరుడు?  టీవీ షోకి తారక్ హోస్టింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.