బన్నీ బ్లాక్ చేయడంతో హీరోయిన్ రియాక్షన్

Sat Mar 18 2023 18:38:04 GMT+0530 (India Standard Time)

BhanuShree shared a screen Allu Arjun blocked her In Twitter

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకులకి అందించడానికి రెడీ అవుతున్నారు. మరో వైపు వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. సౌత్ ఇండియాలో అత్యధికంగా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోగా అల్లు అర్జున్ ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మీద అతనితో కలిసి నటించిన హీరోయిన్ చేసిన విమర్శలు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. వరుడు సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా భానుశ్రీ మెహ్రా అనే బ్యూటీ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఆ మూవీ డిజాస్టర్ కావడంతో తరువాత ఆమెకి ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. దీంతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొచ్చింది. ఆయితే ప్రస్తుతం సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టిన ఈ బ్యూటీ యుట్యూబ్ చానల్ పెట్టి అందులో ట్రావెల్ ఫుడ్ వీడియోస్ చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈమె ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో అల్లు అర్జున్ తనని బ్లాక్ చేసాడు అని ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసింది. దానిపై ఇంటరెస్టింగ్ గా ట్వీట్ కూడా రాసింది. మనం జీవితంలో ఒక చోట స్టక్ అయిపోతున్నాం అనుకున్నప్పుడు. నన్ను గుర్తుచేసుకోండి. వరుడు సినిమాలో నేను అల్లు అర్జున్ కి జోడీగా హీరోయిన్ గా నటించాను. అయితే సినీ ప్రయాణంలో ప్రస్తుతం నాకు పెద్దగా అవకాశాలు లేవు.

అయితే నా ఈ పోరాటంలో కాస్తా హాస్యాన్ని వెతుక్కోవడం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. అందులో భాగంగా కనిపించిందే ఇది. అల్లు అర్జున్ ట్విట్టర్ లో నన్ను బ్లాక్ చేశారు. అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు ఆమెకి సపోర్ట్ గా బన్నీని ట్రోల్ చేస్తూ ఉంటే కొంతమంది మాత్రం భానుశ్రీని క్వశ్చన్ చేస్తున్నారు.

నీ ఫెయిల్యూర్ ని బన్నీని ఎలా కారణంగా చూపిస్తావ్. నీ కెరియర్ ఫెయిల్యూర్ కావడానికి నువ్వు కారణం కాదా. ఒకవేళ బ్లాక్ చేస్తే అందులో తప్పేముంది అని ట్వీట్ చేశారు. దీనిపై భానుశ్రీ రియాక్ట్ అయ్యింది. నా ఫెయిల్యూర్ కి నేను అల్లు అర్జున్ ని నిందించడం లేదు. ఇందులో నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను. ఆ అభిప్రాయం మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. నా అభిప్రాయంలో వ్యక్తం చేయడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. దానితో నచ్చే వారు చూస్తారు. అందులో తప్పైతే ఏమీ లేదు అని పేర్కొంది. అయితే భానుశ్రీ షేర్ పెట్టిన ఈ పోస్ట్ మాత్రం ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారిందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.