Begin typing your search above and press return to search.

బెల్లంకొండ శ్రీనివాస్ మరో క్రేజీ కాంబినేషన్

By:  Tupaki Desk   |   30 March 2023 11:07 AM GMT
బెల్లంకొండ శ్రీనివాస్ మరో క్రేజీ కాంబినేషన్
X
యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. 2014లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతను.. వైవిధ్యమైన ఇతి వృత్తాలతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు.

మాస్ హీరోగా తన సొంత ఇమేజ్‌ని డెవలప్ చేసుకున్న శ్రీనివాస్ బెల్లంకొండ.. తన తొలి బాలీవుడ్ చిత్రం ఛత్రపతిలో కనిపించనున్నాడు. మొదటి సినిమానే రీమేక్ చిత్రం కావడం బెల్లంకొండను బాలీవుడ్ లో ఎలా నిలబెట్టనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆలోపే బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

తన తర్వాతి సినిమా గురించి ఓ అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చాడు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్రతో శ్రీనివాస్ బెల్లంకొండ జతకట్టనున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు వంటి యూనిక్ స్క్రిప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు... బెల్లంకొండ కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇది పదో చిత్రం కావడంతో దీనికి.. బీఎస్ఎస్10 అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. ఈ చిత్రం మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోంది. ఇది ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్.. భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. రామ్ ఆచంట మరియు గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు వివిధ విభాగాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.