Begin typing your search above and press return to search.

హిందీ 'చత్రపతి' అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   4 Dec 2021 5:39 AM GMT
హిందీ చత్రపతి అప్‌డేట్‌
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన చత్రపతి సినిమా ఎంతటి సెన్షేషన్ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ స్థాయిని అమాంతం పెంచిన సినిమా చత్రపతి అనడంలో సందేహం లేదు. ఆ సినిమా ప్రతి ఒక్క నటీ నటులకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది.

రాజమౌళి ఆ సినిమాతో మరో పది మెట్లు ఎక్కాడు. చత్రపతి సినిమా ను ఇన్నాళ్ల తర్వాత హిందీలో రీమేక్ చేస్తున్నారు. పెన్ స్టూడియో సంస్థ ఈ సినిమాను హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్‌ దర్శకత్వంలో రీమేక్ చేయడం జరుగుతోంది. చాలా నెలల క్రితమే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏదీ రాలేదు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన ఒక విషయం అధికారికంగా వెళ్లడయ్యింది.

ప్రస్తుతం హిందీ చత్రపతి సినిమా వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు వివి వినాయక్ చిత్రీకరిస్తున్నాడు. సినిమాలో బెల్లంకొండ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంలో ఇంకా ఎలాంటి హింట్ కాని లుక్ కాని రివీల్ చేయలేదు.

హిందీ చత్రపతి సినిమా చిత్రీకరణ చకచక జరుగుతున్నట్లుగా వినాయక్‌ పేర్కొన్నాడు. వైజాగ్‌ లో చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఏపీ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు యూనిట్‌ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆ సమయంలో దర్శకుడు వినాయక్ తో మంత్రి మాట్లాడుతూ సినిమా యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సందర్బంగా కూడా బెల్లంకొండ లుక్ ను రివీల్ చేయలేదు. కేవలం వినాయక్ మరియు మంత్రి కలిసి ఉన్న ఫొటోను మాత్రమే షేర్‌ చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా అగ్రెసివ్‌గ ఆ కనిపించబోతున్నాడట. ప్రతి సన్నివేశాన్ని కూడా ఏమాత్రం మార్పు లేకుండా రాజమౌళి తీసినట్లుగానే తీస్తున్నట్లుగా చెబుతున్నారు.

రీమేక్ కోసం రాజమౌళి మరియు విజయేంద్ర ప్రసాద్‌ లు పెన్ సాయం చేశారు. వారి సలహాలు మరియు సూచనలతో స్క్రీన్‌ ప్లేను హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చారు. మొత్తానికి హిందీ లో ఎంట్రీ ఇవ్వబోతున్న మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఎలాంటి ఫలితం అందుతుంది అనేది చూడాలి.