బెల్లంకొండ `ఛత్రపతి` రీమేక్ హీరోయిన్ బెంగ తీరలేదా?

Mon Mar 01 2021 16:00:01 GMT+0530 (IST)

Bellamkonda Srinivas Bollywood Debut

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `ఛత్రపతి` హిందీలో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. తెలుగు వెర్షన్ కి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించగా.. హిందీ వెర్షన్ కి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డెబ్యూ హిందీ మూవీపైనే పూర్తిగా దృష్టి సారించిన శ్రీనివాస్ లుక్ కోసం జిమ్ముల్లో తీవ్రంగానే శ్రమిస్తున్నాడని సమాచారం.ఇక ఈ మూవీలో కథానాయిక ఎవరు? అన్నదానికి ఇన్నాళ్లు సరైన ఆన్సర్ లేదు. బాలీవుడ్ లో పలువురిని ప్రయత్నించినా ఇన్నాళ్లు ఓకే కాలేదు. ఆరంభం జాన్వీ పేరు వినిపించింది. ఆ తర్వాత కియరా అద్వాణీ ఓకే చెప్పిందని అన్నారు. కానీ ఆ ఇద్దరిపైనా వచ్చినవి రూమర్లు అని తేలిపోయింది.

తాజా సమాచారం మేరకు.. లోఫర్ బ్యూటీ దిశా పటానీని ఖాయం చేశారని త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. లోఫర్ ఫ్లాపయ్యాక దిశా టాలీవుడ్ వైపు చూడలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ నుంచి హిందీకి వెళుతున్న రీమేక్ కి ఓకే చెప్పడం ఆసక్తికరం. బెల్లంకొండకు దిశా పెద్ద ప్లస్ కానుంది. ఇక ఇంతకుముందు ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో దిశా పటానీ ఖాయమైందని భావించినా చివరి నిమిషంలో శ్రుతిహాసన్ పేరును చిత్రబృందం ఫైనల్ చేసింది.