Begin typing your search above and press return to search.

బెల్లంకొండ స్పోర్స్ట్ డ్రామా ఇంట్రెస్టింగ్!

By:  Tupaki Desk   |   29 May 2023 3:00 PM GMT
బెల్లంకొండ  స్పోర్స్ట్ డ్రామా ఇంట్రెస్టింగ్!
X
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇంత‌వ‌ర‌కూ స‌రైన స‌క్సెస్ లేదు. హీరో క‌టౌట్ అయినా ఆ క‌టౌట్ త‌గ్గ కంటెంట్ ప‌డ‌టం లేదు. సీరియ‌స్ గా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. 'రాక్ష‌సుడు' త‌ప్ప బెల్లం కొండ కెరీర్ లో చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ మరొక‌టిలేదు. క‌మ‌ర్శియ‌ల్ ప్ర‌య‌త్నాల‌న్ని బెడిసి కొడ‌తున్నాయే త‌ప్ప‌! స‌క్సెస్ దారెక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల బాలీవుడ్ లో కూడా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే.

'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ తో క‌నీసం హిందీ జ‌నాల‌కైనా ద‌గ్గ‌ర‌వ‌వ్వాల‌ని ప్లాన్ వేసాడు . కానీ అది బెడిసి కొట్టింది. దీంతో లాభం లేద‌నుకున్న సాయి శ్రీనివాస్ ఏకంగా కంటెంట్ ప‌రంగా త‌న స్టైలే మార్చిన‌ట్లు క‌నిపిస్తుంది.

తాజాగా యంగ్ హీరో ఓ స్పోర్స్ట్ డ్రామాకి ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ నేప‌థ్యంలో సాగే ఓ ఎమోష‌న‌ల్ స్టోరీ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి రాకేష్ ఉప్ప‌ల‌పాటి ద‌ర్శ‌కుడ‌ట‌.

అత‌నే స్టోరీ చెప్పి ఒప్పించిన‌ట్లు తెలుస్తుంది. ఓ ఒలింపిక్స్ లో ఓడిపోయి..మ‌రో ఓలింపిక్స్ లో గెలిచిన ఓ యువ‌కుడి క‌థ‌కు ఫిక్ష‌న్ జోడించి పీరియాడిక్ డ్రామాగా మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తుంది. రాకేష్ ఉప్ప‌లపాటిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తుంది చిన్న బెల్లంకొండ‌నే.

ప్ర‌స్తుతం గ‌ణేష్ హీరోగా 'నేను స్టూడెంట్ ని సార్' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి రాకేష్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే పెద్ద బెల్లకొండ‌తో సినిమాకి లైన్ క్లియ‌ర్ గా ఉంటుంది.

ఎలాంటి ఆటంకాలు లేకుండా సాయి శ్రీనివాస్ తో సినిమా చేసుకోవ‌చ్చు. నిర్మాత కూడా రెడీగానే ఉన్నాడు. 'నాంది' స‌తీష్ వ‌ర్మ‌నే నిర్మాత‌గా సిద్దంగా ఉన్నాడు. 'నేను స్టూడెంట్ ని సార్' కి అత‌నే నిర్మాత కావ‌డంతో సాయి శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ సెట్ చేయ‌డం దర్శ‌కుడికి ఈజీగా మారింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయ‌ని తెలుస్తుంది.