Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : బెల్లంకొండ రెట్రో లుక్‌ అదుర్స్‌

By:  Tupaki Desk   |   18 Oct 2020 3:30 AM GMT
ఫొటోటాక్‌ : బెల్లంకొండ రెట్రో లుక్‌ అదుర్స్‌
X
యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో భిన్న విభిన్నమైన లుక్‌ తో ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ ఉన్నాడు. ఇటీవలే అల్ట్రా మోడ్రన్‌ లుక్‌ లో గడ్డం తో ఉన్న ఫొటోలను షేర్‌ చేసిన ఈ హీరో తాజాగా రెట్రో లుక్‌ తో ఉన్న ఈ ఫొటోను షేర్‌ చేశాడు. ఈసారి బెల్లంకొండ రెట్రో లుక్‌ తో మరింత స్టైలిష్‌ గా కనిపించాడు. రెట్రో రాయల్‌ కారు వద్ద చాలా హుందాగా పాత సినిమాల్లో హీరో మాదిరిగా చాలా స్టైలిష్‌ గా నిల్చున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మాస్ ఆడియన్స్‌ ను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ బెల్లంకొండ హీరో లుక్‌ కు అంతా కూడా పాజిటివ్‌ గా రెస్పాండ్‌ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ హీరో అల్లుడు అదుర్స్‌ సినిమాలో నటిస్తున్నాడు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. అన్ని సరిగా జరిగి ఉంటే షూటింగ్‌ పూర్తి అయ్యి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కాని కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. ఆరు నెలల తర్వాత ఇటీవలే మళ్లీ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది చివరి వరకు సినిమాను విడుదలకు రెడీ చేయాలని భావిస్తున్నారు. మాస్‌ మసాలా సినిమాగా ఈ అల్లుడు అదుర్స్‌ మూవీ ఉంటుందని మేకర్స్‌ చాలా నమ్మకంగా చెబుతున్నారు.