తమ్ముడు అన్నని మించిపోయేలా వున్నాడే

Mon Jan 17 2022 23:00:01 GMT+0530 (IST)

Bellamkonda Ganesh In Swathimuthyam Movie

టాలీవుడ్ లో ఒకే ఇంటి వారసులు సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ. ఒక వారసుడు సక్సెస్ అయితే మరో వారసుడు ఆశించిన స్థాయిలో విజయాల్ని అందుకోలేని సందర్భాలు చాలానే వున్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీనే తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి తరహాలో నాగబాబు సక్సెస్ కాలేక పోయారు కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం అన్నకు మించిన తమ్ముడు అనిపించుకున్నారు. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా రమేష్ బాబు మహేష్ బాబు రంగప్రవేశం చేశారు.కానీ ఈ ఇద్దరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే హీరోగా సక్సెస్ అవ్యడమే కాకుండా స్టార్ హీరోగా నిలబడ్డారు. రమేష్‌బాబు మాత్రం మధ్యలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే బెల్లంకొండ ఫ్యామిలీ మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు  బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇదే ఫ్యామిలీ నుంచ బెల్లకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

తను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `స్వాతిముత్యం`. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ గ్లింప్స్  చూస్తుంటే బెల్లంకొండ గణేష్ నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకునేలా కనిపిస్తున్నాడు. అతని ఎక్స్‌ప్రెషన్స్ నటించిన తీరు అనుభవం వున్న నటుడిలా కనిపించిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

ఫస్ట్ గ్లింప్స్ తోనే బెల్లంకొండ గణేష్ తనదైన నటనతో ఇంప్రెస్ చేశాడని అన్న బెల్లంకొండ శ్రీనివాస్ నే నటనలో మించిపోయేలా వున్నాడని చెబుతున్నారు. రెగ్యులర్ యాక్షన్ సినిమాతో కాకుండా రోమ్ - కామ్ తో తన జర్నీని ప్రారంభించడంతో గణేష్ ప్రయాణం నటుడిగా ఎలా వుండబోతోందన్నది స్పష్టమైందని అతను లాంగ్ రన్ లో వుంటాడని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.  

రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ హీరోలకు మంచి పేరుని తెచ్చిపెడుతుంటాయి. ఆ పరంగా చూసుకుంటే బెల్లంకొండ గణేష్ `స్వాతిముత్యం`తో మంచి పేరుని సొంతం చేసుకోవడం కాయం అంటున్నారంతా. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న `స్వాతిముత్యం` లో రావు రమేష్ ప్రగతి నరేష్ సురేఖా వాణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.