టాలీవుడ్ లో 7 సినిమాలతో చెలరేగిపోతున్న బ్యూటీ

Wed Sep 28 2022 10:21:51 GMT+0530 (India Standard Time)

Beauty with 7 films in Tollywood

అందం.. అభినయం ఉంటేనే సరిపోదు. సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు రావాలన్నా.. అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకోవాలన్నా.. సుడి చాలా అవసరం. అంతేకాదు.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం మరింత అవసరం. ఇలాంటివన్నీ చాలా తక్కువ మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమవుతాయి. తన మొదటి సినిమాతోనే అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నా.. కమర్షియల్ హిట్ పడని భామ శ్రీలీలా. ఈ కన్నడ కస్తూరి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.పెళ్లి సందD మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అందరిని ఆకర్షించటంలో మాత్రం సక్సెస్ అయ్యిందని చెప్పాలి. తాజాగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ లో అందరి నోట్లో నానుతోంది. టాలీవుడ్ లో మరే క్రేజీ హీరోయిన్ కు లేని రీతిలో ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏడు సినిమాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి చలువతో ఆమెకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం రవితేజ నటించిన ధమాకా.. బాలయ్య.. మహేశ్.. శర్వానంద్.. నితిన్ సినిమాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. అటు సీనియర్లతో పాటు ఇటు జూనియర్లు.. మరోవైపు అగ్రహీరోలతో జత కట్టిన ఈ బ్యూటీ క్రేజ్ మామూలుగా లేదంటున్నారు. ఆమె ఒప్పుకున్న ఏడు మూవీల్లో మొదట రిలీజ్ అయ్యేది రవితేజ తో నటిస్తున్న ధమాకా మూవీగా చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.