Begin typing your search above and press return to search.

మూడు రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్ లోకి 'బంగార్రాజు'

By:  Tupaki Desk   |   17 Jan 2022 8:23 AM GMT
మూడు రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్ లోకి బంగార్రాజు
X
అక్కినేని తండ్రీకొడుకులు కింగ్ నాగార్జున - యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం ''బంగార్రాజు''. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. సెకండ్ డే కంటే మూడో రోజు అధిక వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో తొలి మూడు రోజుల్లోనే రూ. 53 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసారు.

కోవిడ్ కారణంగా పాన్ ఇండియా సినిమాలన్నీ సంక్రాంతి రేస్ లోంచి తప్పుకోగా.. అక్కినేని హీరోల ‘బంగార్రాజు’ మూవీ సోలోగా బరిలోకి దిగింది. 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడం.. మొదటి నుంచీ పండుగలాంటి సినిమా.. పండగ కోసమే రెడీ చేశామనని మేకర్స్ ప్రమోట్ చేయడంతో ఫెస్టివల్ సీజన్ లో జనాల దృష్టి దీనిపై పడింది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మొదటి రోజు రూ. 17.5 కోట్లు కలెక్ట్ చేసిన బంగార్రాజు.. రెండో రోజు కలుపుకొని రూ 36కోట్లు గ్రాస్ అందుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇప్పుడు మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోందని తెలుస్తోంది. ఆదివారం వందకు పైగా థియేటర్లు యాడ్ చేసారంటే ఈ చిత్రానికి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డొమెస్టిక్ మార్కెట్ లో బంగార్రాజు హవా కనిపిస్తుండగా.. హైదరాబాద్ మరియు ఓవర్సీస్‌ లో వసూళ్లు తగ్గాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

యూఎస్ఏలో కంటెంట్ సకాలంలో అందించకపోవడంతో సినిమా ప్రీమియర్ రోజునే నష్టపోయింది. అందులోనూ అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో వీకెండ్ లో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. ప్రీమియర్స్ ద్వారా కేవలం $39428 మాత్రమే రాబట్టిన 'బంగార్రాజు'.. శుక్రవారం $66753 - శని $71534 - ఆదివారం సుమారు $40k గ్రాస్ తో మొత్తం 220K డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో సోషియో ఫాంటసీ గ్రామీణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'బంగార్రాజు' సినిమా తెరకెక్కింది. ఇందులో బంగార్రాజుగా నాగార్జున మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయగా.. మనవడు చిన బంగార్రాజుగా నాగచైతన్య సత్తా చాటారు. కృతి శెట్టి - రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.