బంగార్రాజు మళ్లీ వస్తాడట కాని..!

Sun Jan 16 2022 09:26:16 GMT+0530 (IST)

Bangarraju Sequel Update

నాగార్జున హీరోగా అయిదేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందిన బంగార్రాజు చిత్రం తాజాగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. నాగార్జున మరియు నాగ చైతన్యలు కలిసి నటించిన ఈ సినిమా సంక్రాంతి స్పేస్ ను ఫుల్ గా వినియోగించుకుంటూ మంచి వసూళ్లను దక్కించుకుంది. నాగార్జున మరియు నాగ చైతన్యలు ఇద్దరు కూడా బంగార్రాజు పాత్రల్లో కనిపించి మెప్పించారు. నాగ చైతన్య కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించి మెప్పించింది. ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సందర్బంగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బంగార్రాజు సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్ గురించిన చర్చలు మొదలు అయ్యాయి. తప్పకుండా బంగార్రాజు సినిమాకు సీక్వెల్ చేస్తామని నాగార్జున ప్రకటించాడు. అయితే అది ఇప్పుడు ఉండదు అన్నట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు. కాస్త ఆలస్యంగా బంగార్రాజు సీక్వెల్ ను చేస్తామని ఆయన ప్రకటించాడు. నాగార్జున మరియు నాగ చైతన్యలు కలిసి నటించడం వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగింది. కనుక ముందు ముందు రాబోతున్న బంగార్రాజు సీక్వెల్ లో కూడా కచ్చితంగా వీరిద్దరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. సీక్వెల్ లో మరో అక్కినేని హీరో అయిన అఖిల్ అక్కిననేని కూడా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున బంగార్రాజు ప్రకటించిన తర్వాత విడుదల అవ్వడానికి అయిదు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు బంగార్రాజు సీక్వెల్ ను ప్రకటించాడు. అది కూడా ఇప్పుడు కాదని నాగార్జున చెప్పడంతో బంగార్రాజు సీక్వెల్ రావడానికి అయిదు ఆరు సంవత్సరాలకు ఎక్కువే పట్టవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణదర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన మరియు బంగార్రాజు సినిమాలు రూపొందాయి. బంగర్రాజు సినిమా సీక్వెల్ కూడా ఆయన దర్శకత్వంలో రూపొందబోతుందా అనేది చూడాలి.